రాజమండ్రిలోని పోచమ్మ దేవాలయం నుంచి పాపికొండల మీదుగా భద్రాచలం లాంచీలో ప్రయాణం ఓ మంచి అనుభూతిని ఇస్తుంది.  ప్రతి సంవత్సరం ఈ సమయంలోనే ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.  ఎందుకంటే వర్షాలు కురిసి గోదావరిలో నీరు నిండుగా ఉంటుంది.  అలాంటి సమయంలోనే బోటు ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది.  అయితే, ఈ ఏడాది ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో... గోదావరికి వరద ఉదృతి ఎక్కువైంది.  


ఈ వరద కారణంగా గోదావరిలో బోటులను అనుమతించలేవు. ముఖ్యంగా దేవీపట్నం మండంలోని ఏరియాల్లో వరద నీరు అధికంగా ఉన్నది.  దేవీపట్నం మండలంలోని వివిధ గ్రామాలు నీటి ముంపులో మునిగిపోయిన సంగతి తెలిసిందే.  వరద ఉదృతి కారణంగా పడవలను అనుమతించడం లేదు. ఈ సమయంలో ఎలా అనుమతించారో తెలియదుగాని, రాయల్ వశిష్ట అనే పడవను అనుమతించారు.  ఈ బోట్ పోచమ్మ దేవాలయం నుంచి పాపికొండల వరకు బయలుదేరింది.  


61 మంది ప్రయాణికులతో బోటు బయలుదేరింది.  అందులో 50 ప్రయాణికులు కాగా, 11 మంది సిబ్బంది ఉన్నారు.  బోటు బయలుదేరిన గంటన్నరకు దేవీపట్నం మండలంలోని కచులూరు మందం వద్దకు చేరుకోగానే ఓ బండారాన్ని డీకోట్టింది.  దీంతో పడవ బోల్తాపడింది.   అయిదు, ప్రయాణికుల్లో కేవలాం 14 మంది మాత్రమే లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో సేఫ్ గా బయటపడ్డారు.  మిగతా ప్రయాణికులు నీళ్లలో మునిగిపోయారు.  వీరికోసం ఎన్డీఆర్ బృందాలు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

గోదావరికి వరద ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా అనుమతి ఇచ్చారని దానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నది.  గతంలో 1964 లో విజయభాస్కర్ అనే పడవ అదే ప్రాంతంలో ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో 60 మంది మృతి చెందారు.  ఆ తరువాత జరిగిన ఝాన్షి రాణి అనే బోట్ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు.  ఇప్పుడుకూడా అదే ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకోవడం విషాదం అని చెప్పాలి.  అదే ప్రాంతంలో ఎందుకని పదేపదే ప్రమాదాలు జరుగుతున్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు.  ప్రస్తుతం గోదావరిలో సహాయక చర్యలు జరుగుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: