గత 15 రోజులుగా వాహనదారులు జరిమాణాలతో బెంభేలెత్తిపోతున్న సంగతి తెలిసిందే. అనవసరంగా ఫైన్లు వేస్తున్నారని, మధ్య తరగతి ప్రజల నడ్డి వంచడానికే ఈ ఫైన్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఫైన్లు మంచివే అని ఇలా వెయ్యడం కరెక్ట్ అని అంటున్నారు మరి కొంతమంది మధ్య తరగతి ప్రజలు.   


మధ్య తరగతి ప్రజలే కదా ఫైన్లు వొద్దు అనినింది. ఇప్పుడు ఎందుకు ఈ ఫైన్లు కావాలి అంటున్నారు అంటూ అందరూ ప్రశ్నించచ్చు. కానీ వాళ్ళు ఆలా చెప్పడం ఏ కరెక్ట్. ఎందుకంటే మధ్య తరగతి ప్రతి ఒక్కరికి కార్లు ఉండవు, ఆలా అని అందరికి బైకులు ఉండవు. మధ్య తరగతిలో కూడా బిలో మధ్య తరగతి.. అబొవె మధ్య తరగతి అని రెండు ఉంటాయి.   


అందరూ కార్లల్లో పోలేరు.. ఆలా అని బస్సు లోను పోలేరు. 40శాతం మధ్య తరగతి ప్రజలు కాలినడకనే జీవనం సాగిస్తున్నారు. కానీ ఆలా కాలినడక నడిచే ఫుట్ పాత్ పై కూడా వాహనాలను నిలిపి కాలినడక నడిచే వారిని రోడ్డుపైకి తోసేస్తుతున్నారు, యాక్సిడెంట్లు 20 శాతం మందికి ఫుట్ పాత్ పై వాహనాలు ఉన్న సమయంలో రోడ్లపై వారికే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఓ సర్వే కూడా చెప్తుంది.   


ఈ విషయంపై మధ్య తరగతి ప్రజలు స్పందిస్తూ 'వాహనదారులకు జరిమానాలు వెయ్యడంలో తప్పు లేదు .. పదింతలు జరిమానా వేసినా ఎంత మాత్రం తప్పు లేదు'.. అని అంటున్నారు. నిజమే ఇప్పుడు పోలీసులు హెల్మెట్ లేని వారిని, మద్యం తగిన వారిని కాదు 'నో పార్కింగ్' బోర్డు ఉన్న చోటా వాహనాలను నిలిపిన వారిపై జరిమానాలు విధించండి. కాలినడకన నడిచే వారికీ సహకరించండి.     


మరింత సమాచారం తెలుసుకోండి: