అప్పుడప్పుడే స్కూల్ లో ఎన్నో నిబంధనలను పాటించి ఇక నుంచి మన లైఫ్ బిందాస్.. మన డ్రెస్ మన ఇష్టం అని రెచ్చిపోవాలని చూస్తారు. కానీ తల్లితండ్రులు ఆలా విచ్చలవిడిగా ఉండనివారు కదా.. పిల్లలు పద్ధతి ఉండాలనుకుంటారు. అందుకే గర్ల్స్ స్కూల్ నుంచి డైరెక్ట్ ఉమెన్స్ కాలేజీలోకి వేసేస్తారు. ఆడపిల్లలు కదా కాపాడుకోవాలని. 


దీంతో జీన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు బట్టలపై ఇష్టాన్ని చంపుకొని ఉమెన్స్ కాలేజీలోని నిబంధనలను పాటిస్తారు. మరి కొంతమంది మాత్రం ఆ నిబ్బందనలను వ్యతిరేకించాలనుకుంటారు. చిన్న పిల్లలమా ఏమైనా.. మనకు తెలీదా ఎలా ఉండాలో అనుకుంటారు. ఆలా అనుకున్న వారిని ఈరోజు ఓ ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ బయట నిలబెట్టింది. 


విషయానికి వస్తే .. హైదరాబాద్ లోని బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీలో కుర్తీ వివాదం తలెత్తింది. కాలేజీ విద్యార్థినిలు మోకాళ్ల దిగువ వరకు ఉండే కుర్తీలను ధరించాలని ప్రిన్సిపాల్ నిబంధనలు విధించారు. కానీ చాలామంది అమ్మాయిలు ఆ నిబంధనను ఉల్లగించే సరికి ప్రిన్సిపాల్ సరికొత్తగా ఆలోచించింది.  


మహిళా సెక్యూరిటీ గార్డులను గేట్ దగ్గర ఉంచి విద్యార్థిని కుర్తీ పొడవులను కొలిపించారు. మోకాళ్ల పైకి ఉండే కుర్తీలను ధరించిన విద్యార్థినిలను సెక్యూరిటీ గార్డులు కాలేజీ లోపటికి అనుమతించకుండా బయటనే ఆపేస్తున్నారు. దీంతో ఆ విద్యార్థినిలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుర్తీ నిబంధనకు విరుద్ధంగా విద్యార్థినిలు ఆందోళనకు సిద్ధమయ్యారు. 


దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ 'నిజమే కదా అమ్మ.. కాలేజీ నిబంధనలు పాటించడం మంచిదే. వాళ్ళు చెప్పేది కరెక్ట్.. కాలం బాలేదు మీరు మిమ్మల్ని కాపాడుకునే స్టేజికి వచ్చే వరుకైన ఈ నిబంధన పాటించండి అమ్మాయిలు'' అంటూ కామెంట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: