ప్రపంచంలో జ్ఞానం లేనివాళ్లు తప్పు చేస్తున్నారంటే ఒక లెక్క వుంది ఎందుకంటే అతను అజ్ఞానం అనే వలలో చిక్కుకుని ఉన్నాడు కాబట్టి,కాని గొప్ప గొప్ప చదువులు చదివి, జ్ఞానాన్ని అపారంగా సంపాదించి,ఏది మంచో,ఏది చెడో తెలిసే స్దితిలో వున్న గురువులు కూడా తప్పుచేస్తే సర్వతి దేవి జ్ఞానాన్ని ప్రసాధించింది అన్యాయాలు చేయడానికా అనే ప్రశ్న తప్పక మదిలో మెదులుతుంది.రాజకీయం యూనివర్శిటీల్లో రాజ్యమేలుతుంటే,చదువులతల్లి తన బిడ్దలు పడే కష్టాలను చూసి కన్నీళ్లు పెడుతుంది.మనషులగోస చెప్పుకోవడానికి మరో మనస్సు పక్కనే వుంటుంది.కాని ఆవేదనతో అనుక్షణం భాధపడే సరస్వతి తల్లి వేదన అర్ధం చేసుకునేవారెవ్వరూ.ఆ ఆక్రందన తెలుసుకునే దారేది.అది ఒక్క గురుస్దానంలో వున్న వ్యక్తులకే అర్ధం అవుతుంది కాని వారు మరోలోకంలో అదే అవినీతి అనే లోకంలో విహరిస్తూవుంటే ఇక తన గోస పట్టించుకునే వారెవ్వరు.



చదువుకునే ప్రతి విద్యార్ధి భరత భూమికి ప్రియ పుత్రుడు,ఎందుకంటే యూనివర్శిటీల్లో వెలిగించుకున్న జ్ఞానాన్ని ప్రపంచం అంతటికి ఓ శాస్త్రవేత్తగా,ఓ విద్యావేత్తగా ఇలా అనేక రకాలైన రూపాల్లో పంచుతాడు.కాని ఆ చదువులే మట్టిరంగు పులుముకుని మసిలా మారుతుంటే భావితరానికి చీకటే మిగులుతుంది. దయచేసి విద్యార్ధుల ఆవేదన అర్ధం చేసుకోండి.జ్ఞానం అనేది వెలుగుతున్న జ్యోతిలాంటిది.ఆ జ్యోతితో విద్యార్ధుల జీవితాలకు పాడెకట్టి చితి పేర్చకండి. యూనివర్శీటిల్లో ఆత్మహత్యలు,అరాచకాలు ఇకనైన ఆపండి.మీ విధులు మీరు సక్రమంగా నిర్వహిస్తే ఇన్ని విద్యార్ధి సంఘాలు రోడ్డున ధర్నాలు చేసేవి కావు,స్టూడెంట్స్ బ్రతుకులు అయోమయంలో పడేవి కావు.ఎందరో తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న ఆశలు సమాధులు కావు.



వ్యవస్ద మారాలంటే వ్యక్తులు మారాలి అప్పుడే భావితరాలకు భ్రాంతి తొలగి బతుకు స్వర్ణమయమవుతుంది. ఇదంతా అధ్యాపకుల చేతుల్లో వుంటుంది.ఇక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, 65 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన యూనివర్సిటీ,ప్రకాశము పంతులు గారు,నీలం సంజీవ రెడ్డి గారి వంటి మహామహుల చేతుల మీదుగా 1954 లో  ప్రారంభించబడి ఎందరో మహానుభావులను జాతికి అందించిన ఘన చరిత్ర కలిగి రాయలసీమ,నెల్లూరు వాసులందరికీ, ముఖ్యంగా యువతకు ఎంతగానో ఉపయోగ పడుతున్న ఘన విశ్వ విద్యాలయం ఇది.దయచేసి ఈ చరిత్రకు చెదలు పట్టించకండని ఎందరో విద్యార్ధిని,విద్యార్ధులు వేడు కుంటున్నారట.ఇకనైన వారి గోడు అధికారుల చెవికి చేరుతుందో లేదోనని అందరు అనుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: