యురేనియం తవ్వకాలను రాష్ట్రంలో అనుమతిచ్చేది లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. అంతే కాకుండా కేంద్రానికి ఏకంగా అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పంపించారు. దీంతో ప్రస్తుతానికి తెలంగాణకు యురేనియం ముప్పు తప్పినట్టే.. ఈ నేపథ్యంలో అసలు జీవజాలంపై యురేనియం ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం..


1987 సంవత్సరంలో ది నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఆక్యూపేషనల్‌ సొసైటీ అండ్‌ హెల్త్‌ గుర్తించిన విషయాల ప్రకారం యురేనియం అనేది భయంకరమైన అణుధార్మిక పదార్థం. ఇందులోని రేడాన్‌ వాయువులు యురేనియం తవ్వకాల గనులలో పని చేస్తున్న కార్మికుల శరీరాల్లోకి వెళ్లి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కు దారి తీస్తుంది.


అణు విద్యుత్‌ ప్లాంటు, అణు శుద్ధి కర్మాగారాల్లో జరుగుతున్న ప్రమాదాలన్ని కేవలం మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నది. భూ కంపాలు, సునామి, వరదల వల్ల సంభవించిన ప్రమాదాలు చాలా తక్కువ. కావున ఇవి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు.


మనం రోజు తీసుకునే ఆహారంలో, నీటిలోను యురేనియం పాళ్లు 0.9 మైక్రో గ్రాములుగా ఉండడం ప్రమాదం కాదని తెలియజేస్తున్నారు. యురేనియం భూమి నుంచి లభించే అన్ని గనులలో ప్రధాన ఖనిజంగా ఉంటుంది. దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కానీ యురేనియం గనుల తవ్వకాల, గాలి, నీటి, ఆహారం ద్వారా చర్మం నుంచి శరీరంలోకి వ్రవేశిస్తుంది. తద్వారా ఒక మానవ జాతికే కాకుండా మొత్తం జీవజాతి పరిణామంపై ప్రభావం చూపుతుంది. తల్లి జీవి ద్వారా ఈ విషపూరితాలు అంగవైకల్యం సంభవించి వికృత జీవులుగా జన్మిస్తారు. యురేనియం శుద్ధి కోసం అధిక మొత్తంలో నీటి వనరులు అవసరమవుతాయి. శుద్ధి కోసం వాడిన నీరు తిరిగి మంచి నీటి ప్రవాహాల్లో కలవడం వల్ల ఈ నీటిని తాగే జంతువులు మరణిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: