ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య మిస్టరీ ఇంకా చిక్కుముడిగానే ఉంది. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు.. నిజంగా ఏపీ సర్కారు పెద్దల ప్రోద్బలంతో కొందరు పెడుతున్న కేసుల విచారణ కారణంగానే మనస్తాపానికి గురయ్యారా.. లేక.. కుటుంబ సమస్యల కారణంగా మానసినకంగా విసిగిపోయారా.. అన్నది తేలాల్సి ఉంది.


ఈ చిక్కుముడి వీడాలంటే.. కేసు విచారణ ముందుకు కదలాలి. ఈ కేసులో కీలక ఆధారాలు సంపాదించేందుకు పోలీసులు కోడెల ఫోన్ రికార్డులు సరి చూస్తున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. కోడెల ఆత్మహత్య చేసుకునే ముందు.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్యురాలితో దాదాపు 20 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.


కోడెల ఆమెకు ఎందుకు కాల్ చేశారు.. ఓ వైద్యురాలితో ఆత్మహత్యకు ముందు ఏం మాట్లాడారు.. అన్నది ఇంట్రస్టింగ్ గా మారింది. నిజంగా కోడెల ఆత్మహత్య చేసుకునే విషయమైతే.. చివరి నిమిషాల్లో ఆప్తులతోనో, బంధువులతోనో.. మాట్లాడే అవకాశం ఉంది. అలా కాకుండా ఓ వైద్యురాలితో కోడెల ఏం మాట్లాడి ఉంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.


బసవతారకం ఆసుపత్రితో కోడెలకు చాలా అనుబంధం ఉంది. హైదరాబాద్ లోని ఈ బసవ తారకం ఆసుపత్రికి ఆయన చాలా కాలం ట్రస్టు చైర్మన్ గా సేవలందించారు. కోడెల శివప్రసాదరావు ఎన్టీఆర్ కు దగ్గరి వ్యక్తి కావడం.. అందులోనూ కోడెల శివప్రసాదరావు స్వయంగా వైద్యుడు కావడంతో బసవతారకం ట్రస్టు ఛైర్మన్ గా కోడెల శివప్రసాదరావును ఎన్టీఆర్ కుటుంబం నియమించింది.


బసవతారకం ఆసుపత్రి అభివృద్ధికి కోడెల శివప్రసాదరావు చాలా కృషి చేశాడని చెబుతారు. తానే స్వయంగా చాలా కాలం ఛైర్మన్ గా ఉన్న ఆసుపత్రిలోనే కోడెల మృతదేహం ఉంచాల్సి రావడం విషాదమే. అంతగా అనుబంధం ఉన్న ఆసుపత్రిలోని వైద్యులు కూడా కోడెలకు ఆప్తులై ఉండొచ్చు. స్వయంగా కోడెల కూడా వైద్యుడు కావడంతో వృత్తిపరంగానూ దగ్గరి వ్యక్తి అయి ఉండొచ్చు. ఏదేమైనా ఆయన ఆమెతో ఏం మాట్లాడారన్నది పోలీసులే తేల్చాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: