ఏపీ సీఎం జగన్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ కు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్.. ద్రాక్షారామంలో ఇటీవలే పార్టీలో చేరిన తోట త్రిమూర్తులుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీలో చేరినా తోట త్రిమూర్తులు ఎప్పుడూ తన శత్రువే అని సుభాష్ చంద్రబోస్ అన్నారు. దీంతో మండిపడిన జగన్.. పిల్లి సుభాష్ చంద్రబోస్ కు క్లాస్ పీకారట.


ఎంత విబేధాలు ఉన్నా.. అలా బహిరంగంగా మాట్లాడితే ఎలా అన్నా అంటూ మెత్తగానే క్లాస్ పీకారట జగన్. జగన్ సాధారణంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ను బాగా గౌరవిస్తారు. సీనియర్ నాయకుడిగా అభిమానిస్తారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు ప్రత్యర్థులకు అస్త్రాలవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది.


అసలు ఇంతకీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అలా ఎందుకు అన్నారు.. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి .. ఓసారి పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 23 ఏళ్ల కిందట దళితులకు శిరోముండనం చేశారు. ఈ కేసులో తోట త్రిమూర్తులు ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఆ కేసు అప్పటి నుంచి కోర్టుల్లో నడుస్తూనే ఉంది. ఒకప్పుడు దళితులకు శిరోముండనం చేసిన తోట త్రిమూర్తులును పార్టీలోకి ఎలా రానిచ్చారని ద్రాక్షారామంలో దళితులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు.


ఆ సమయంలో దళితులకు సర్ది చెప్పిన సుభాష్ చంద్రబోస్.. ఆ కేసుకు సంబం‌ధించిన లాయర్ ఖర్చులన్నీ తానే పెట్టుకుంటున్నానని.. ఈకేసును ఫాలో చేస్తున్నానని.. దళితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు. అసలు తోట త్రిమూర్తులును ఎందుకు పార్టీలోకి రానిచ్చారని దళితులు నిలదీశారు. దీంతో ఆగ్రహం చెందిన పిల్లి సుభాష్.. పార్టీలోకి వస్తుంటారు..పోతుంటారు.. అయినంత మాత్రాన ఆయన నా మిత్రుడు కాదు.. ఇక ముందు కూడా త్రిమూర్తులు తనకు ప్రథమ శత్రువే అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: