మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే ఉంది. ఎంఎల్ఏగా ఉన్న పదేళ్ళ కాలంలోను, అధికార పార్టీ ఎంఎల్ఏగా ఉన్నపుడు సాగించిన అరాచకాలే ఇపుడు మెడకు చుట్టుకుంటున్నాయి. ఎవరిని పడితే వారిని కొట్టడం. ఎవరినైనా సరే నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం లాంటి లక్షణాలతో చింతమనేనికి బాగా నెగిటివ్ పాపులారిటి వచ్చింది.

 

ఒకవిధంగా చెప్పాలంటే చింతమనేని అరాచకాల వెనుక సాక్ష్యాత్తు చంద్రబాబునాయుడే ఉన్నారంటే తప్పేమీ కాదు. చింతమనేని దాష్టీకాలపై టిడిపి నేతలే ఎంత చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. చంద్రబాబు మద్దతు పూర్తిగా ఉండటంతో ఆకాశమే హద్దుగా చింతమనేని రెచ్చిపోయారు. దాంతో దాదాపు 60 కేసులు నమోదయ్యాయి.

 

చింతమనేని బాధితుల్లో ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలున్నారంటే అర్ధముంది. కానీ ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు సొంత పార్టీలోని నేతలు కూడా ఉన్నారంటేనే చింతమనేని అరాచకాలు ఏ స్ధాయిలో ఉండేదో అర్ధమైపోతుంది. అలాంటి చింతమనేనికి తాను ఓడిపోయి, టిడిపి కూడా ఘోరంగా ఓడిపోయిన తర్వాత చుక్కలు కనబడుతున్నాయి.

 

బాధితులందరూ చింతమనేనిపై ఫిర్యాదులు చేశారు. అందులో ఎస్సీ వేధింపుల కేసు కూడా ఉండటంతో పోలీసులు అరెస్టు చేశారు. సరే మరికొద్ది రోజుల తర్వాత బెయిల్ పై విడుదల అవనున్న చింతమనేని కోసం మరి కొన్ని కేసులు రెడీగా ఉన్నాయట. అంటే చింతమనేని ఇటు బెయిల్ పై బయటకు రాగానే మళ్ళీ జైల్లోకి నెట్టటానికి చాలా కేసులే కాచుకుని ఉన్నాయని అర్ధమైపోతోంది.

 

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఐదేళ్ళు జైల్లోనే కూర్చోబెట్టేందుకు సరిపడ కేసులున్నాయి చింతమనేనిపైన.  అధికారంలో ఉన్నాం కదా అన్న అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయనటానికి చింతమనేని వ్యవహారమే సజీవ నిదర్శనం.  చంద్రబాబు పెంచి పోషించిన ఇలాంటి వాళ్ళు టిడిపిలో చాలామందే ఉన్నారు.

 

అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పట్లో వాళ్ళపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయారు. అధికారంలో నుండి దిగిపోయారు కదా అందుకే ఇపుడు పర్యవసానాలను అనుభవిస్తున్నారు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రే అనగలరు చంద్రబాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: