ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే దాదాపు లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు. రికార్డు సమయంలో పరీక్షలు నిర్వహించారు. అత్యంత తక్కువ సమయంలోనే ఫలితాలు కూడా ఇచ్చేశారు.. ఇది దేశంలోనే రికార్డని మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రరారెడ్డి చెబుతున్నారు. అంతవరకూ ఓకే.


కానీ ఈ పరీక్షాపత్రాలు లీకయ్యాయని.. అది కూడా ఏపీపీఎస్సీలోనే పని చేసే ఉద్యోగులే ఆ పని చేశారని ఆంధ్రజ్యోతి పత్రిక సంచలన కథనం రాసింది. ఆ పత్రిక కథన ప్రకారం..

“ ఆ పరీక్ష పేపర్లు సిద్ధంచేసిన ఏపీపీఎస్సీలోనే వారు పనిచేస్తున్నారు. అంతేకాదు పేపర్లు తయారుచేసిన విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగి ఒకరు ఈ పరీక్షలకు హాజరయ్యారు. గురువారం విడుదలచేసిన సచివాలయ ఫలితాల్లో కేటగిరి-1లో టాప్‌ 1 ర్యాంకరు ఆమే!


ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో దాదాపు అందరూ గ్రామ సచివాలయ పోస్టులకు అర్హత సాధించారు. ఆయన భార్య కాకుండా ఇంట్లో మరో ఇద్దరు మంచి ర్యాంకులు తెచ్చుకొన్నారు. పేపరు సంపాదించిన ఏపీపీఎస్సీలోని కొందరు ఉద్యోగులు.. దానిని గుట్టుగా ఉంచలేదు. బంధువులు, సన్నిహితులకూ లీక్‌ చేశారు.


పరీక్ష పేపరు తయారుచేసింది ఏపీపీఎస్సీ. ఆ పేపరు ఆధారంగా పరీక్ష నిర్వహించిందీ కమిషనే. కానీ, పేపరు తయారీకి, పరీక్ష నిర్వహణకు మధ్యలో ప్రశ్నపత్రం ఓ రిటైర్డు అధికారి చేతికి పోయింది. అనితమ్మ కేటగిరి-1లో టాప్‌ ర్యాంకర్‌. ఏపీపీఎస్సీలో పరీక్షల వ్యవహారాలు చూసే విభాగంలో అనితమ్మ ఔట్‌సోర్సింగ్‌ విధానంలో జూనియర్‌ అసిస్టెంట్‌. ప్రశ్నపత్రం టైప్‌ చేసిందీ ఆమేనని కమిషన్‌ వర్గాలే అంటున్నాయి! దొడ్డా వెంకట్రామిరెడ్డి కేటగిరి-3లో ఫస్ట్‌ ర్యాంకరు, .కేటగిరి-1లో మూడో ర్యాంకరు. ఆయన సొంత అన్న ఏపీపీఎస్సీలో ఏఎస్‌వో. “


ఇదీ ఆంధ్రజ్యోతి కథనం..మరి ఈ కథనం నిజమేనా.. ఉదయం పత్రికలో విషయం చూడగానే పరీక్ష రాసిన వారి ఆశ్చర్యపోయారు. మరీ ఇంత దారుణం జరిగిందా.. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: