ప్లాస్టిక్.. మనిషి కనిపెట్టిన ఈ పదార్థం ఇప్పుడు ఆ మనిషి మనుగడకే ముప్పుగా మారుతోంది. అందుకే వీలైనంత వరకూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై త్వరలో నిషేధం విధించాలని కేంద్రం భావిస్తోంది. ప్రధాని మోడీ ప్లాస్టిక్‌ను నిషేధించడానికి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2 నుంచి ఈ నిషేధం అమల్లోకి రాబోతోంది.


జెండాలు, బెలూన్లు, ఇయర్‌ బడ్స్‌, క్యాండీలకు ఉపయోగించే పుల్లలు, స్ట్రాలు, 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న సంచులను నిషేధించాలని భావిస్తోంది. ప్లాస్టిక్‌ షీట్లు అతికించి చేసిన ప్లేట్లు, గిన్నెలు, చిన్ని కప్పులు, ఫోమ్డ్‌ ప్లేట్లు, కప్పులు, అల్లికలేని బ్యాగులు, చిన్న ప్లాస్టిక్‌ సీసాలు, ప్యాకింగ్‌కు ఉపయోగించే చిన్న తరహా షీట్లు, థర్మాకోల్‌ వస్తువులను నిషేధించాలని మోదీ ప్రకటించారు.


మరి మోడీ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు అమలవుతుందో చూడాలి. నిజమే.. రోజురోజుకి ప్లాస్టిక్‌ పెను భూతం అవుతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్‌ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. పాలు, కూరగాయలు, టిఫిన్‌, భోజనం ఏది తేవాలి అన్న ప్లాస్టిక్‌ కవర్లు కావాల్సిందే.. ప్లాస్టిక్‌ లేనిదే ఏది తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్లాస్టిక్‌ పై నిషేదం విధించినా.. ఎన్ని చర్యలు చేపట్టినా లాభం లేకుండా పోతోంది. గ్రామాల నుంచి నగరాల వరకు అంతా ప్లాస్టిక్‌ మయం అయిపోయింది.


మరి దీనికి ప్రత్యామ్నాయాలు చూపకుండా.. వాటిని విరివిగా అందుబాటులోకి తేకుండా.. నిషేధం విధిస్తే జనం ఇబ్బందిపడతారు. అంతే కాదు.. అలా చేస్తే నిషేధం నవ్వులపాలవుతుంది. ఎందుకంటే.. గతంలో ప్లాస్టిక్‌ను నిషేధించాలని జీహెచ్‌ఎంసీ ఓ వినూత్న ప్రయత్నం చేసింది. తడి, పొడి చెత్తలను వేరుగా చేసి పారిశుధ్య సిబ్బందికి అందించేలా.. ఇంటింటికి రెండు చెత్త బుట్టలను పంపిణీ చేసింది. అయినప్పటికీ ఆ సంకల్పం కొద్ది రోజుల వరకే అమలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: