ఎమ్మెల్యే అంటే.. ఎంతసేపూ రాజకీయాలు.. ఎదురుదాడులు, ప్రెస్ మీట్లు.. ఆరోపణలు, విమర్శలు, ప్రతిదాడులు ఇవేనా.. ఇంకేమీ ఉండదా.. తమ ప్రాంతంలో ప్రజలు ఎలా ఉన్నారు.. వారు ఏం చేస్తున్నారు. వారి సమస్యలు ఏంటీ అనే విషయం పట్టించుకోవాలిగా.. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు జనంలోకే పెద్దగా వెళ్లారు.. ఎంతసేపూ సంపాదనపైనే ఆశ.


ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్ము ఎలా రాబట్టుకోవాలి.. అధినాయకుడిని ప్రసన్నం చేసుకుని మంత్రి పదవి ఎలా పట్టేయాలి.. లేకపోతే... హైకమాండ్ సిఫారసులతో లాభాలు వచ్చే ఏ కాంట్రాక్టులు సంపాదించుకోవాలి..ఇదే ధ్యాస.. కానీ కొంత మంది మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు.అలాంటి వారిలో ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఒకరు. ఆయన సోమవారం ఏంచేశారంటే.. మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు వెళ్లారు.. అక్కడి పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి ఉపాధ్యాయులతో మాట్లాడారు.. పాఠశాల సమస్యలు తెలుసుకున్నారు. స్వయంగా తానే తరగతి గదులన్నీ తిరిగి పరిశీలించారు.


పాఠశాలల్లో అడుగు పెట్టగానే ఆయన తానో ఎమ్మెల్యే అన్న సంగతి మరిచిపోయారు.. కొత్తగా ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు.. గతంలో క్లాసు టీచర్ గా పనిచేసిన అనుభవం ఉందో లేదో తెలియదు కానీ.. అదిరిపోయేలా పిల్లలు క్లాసు చెప్పారు. ఆ చెప్పిన సబ్జక్టు ఏంటో తెలుసా... కంప్యూటర్ సైన్స్.. ఎమ్మెల్యే క్లాసు చెప్పారంటే.. ఏదో పేపర్లో ఫోటోల కోసం అన్నట్టు ఓ పావుగంటో అరగంటో కాకుండా... ఏకబిగిన దాదాపు 3 గంటలు పాఠాలు చెప్పారు.


ఊరికే క్లాసు చెప్పడమే కాదు.. విద్యార్థుల్లో స్పూర్తి నింపారు.. మీరు పిల్లలు.. మీకు చాలా భవిష్యత్ ఉంది.. మీ మైండ్ పవర్ చాలా ఎక్కువ.. మీరు ఏదైనా ఇట్టే పట్టేస్తారు.. అంటూ పిల్లల్లో ఉత్తేజం నింపారు.. చదువు, టెక్నాలజీ ప్రాముఖ్యత గురించి వివరించారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇలా చేస్తే బావుంటుంది కదా. అంటే పాఠాలే చెప్పమని కాదు..ప్రజల మధ్యకు వెళ్లడం.. వారిలో పాజిటివ్ స్ఫూర్తి నింపడం మంచిదే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: