పోలవరం ఏపీకి పెద్ద వరం.. దాన్ని పూర్తి చేస్తే ఏపీకి నీటి కొరత ఉండదు. కానీ పోలవరం సెంటిమెంట్ చాటున చంద్రబాబు సర్కారు వందల కోట్లు కాజేసిందా.. రాష్ట్రాన్ని అప్పుల్లో పడేసింది.. పోలవరం త్వరగా పూర్తవుతుందని చెప్పి.. టెండర్లు లేకుండా వందల కోట్లు కమీషన్లు తీసుకుందా.. అవునంటున్నాయి వైసీపీ వర్గాలు.


ఇప్పుడు వైఎస్ జగన్ వాస్తవాలను ప్రజలకు ధైర్యంగా చెప్పి.. సర్కారుపై భారం తగ్గిస్తూనే పోలవరం వేగంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. వైసీపీ వాదన ఇదీ..

“ రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం పనులు జాప్యం అని వాదించేవాళ్ల మాటల్లో వాస్తవం లేదు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం అని వైయస్ జగన్ మాట అక్షరాలా నెరవేర్చబోతున్నారు. పోలవరం అంచనా వ్యయం పెంచి, కమీషన్లు తిని, పనులను పడకేయించిన గత ప్రభుత్వ నిర్లక్ష్యన్ని రివర్స్ టెండరింగ్ తో వదిలించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులెన్నో చేసిన మేఘా సంస్థ సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పోలవరాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తామనే హామీ ఇస్తోంది.


ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా నిలబడ్డ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలకు ఇస్తున్న ఒకే లక్ష్యం వేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం. బృహత్తర నిర్మాణాలు చేపట్టి దేశంలో నెంబర్ 2 అనిపించుకున్న మేఘా సంస్థ ప్రతిష్టాత్మకంగా పోలవరాన్ని నిర్ణీతవ్యవధిలో పూర్తిచేస్తుందని భావించవచ్చు. వందరోజుల వ్యవధిలోనే పోలవరంపై సమీక్ష, టెండర్లు పిలవడం, ఖరారు చేయడం జరిగిపోయాయి.ఇదీ వైసీపీ వాదన.. ఏదేమైనా పోలవరం సత్వరం పూర్తికావడమే ఏపీకి అవసరం.


మరింత సమాచారం తెలుసుకోండి: