టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష వైసీపీని నానా యాత‌న‌కు గురిచేసి ఆనందం పొందిన విష‌యం మ‌రువ‌క‌ముందే ఇప్పుడు అదే పాత్ర‌ను వైసీపీ నేత‌లు ఇప్పుడు పోషిస్తున్నారు. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీని అధికారంలో ఉన్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేత‌లు ఇరుకున పెడుతూ గుక్క‌తిప్పుకోకుండా విమ‌ర్శ‌లు చేస్తూ టీడీపీ నేత‌ల నోటికి తాళాలు వేసారు. వైసీపీ ప్ర‌భుత్వం ప‌రిపాల‌న చేసుకుంటూనే మ‌రోవైపు టీడీపీని ఇరుకున పెడుతూ ముందుకు సాగుతున్నారు.


సీఎం జ‌గ‌న్ ఇస్తున్న బూస్టింగ్‌తో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయ‌కులు రెచ్చిపోయి అవ‌స‌రం మేర‌కు టీడీపీని అంశాల వారిగా ఇరుకున పెడుతూ, గ‌త పాల‌న‌లో చేసిన లోపాల‌ను ఎత్తిచూపుతూనే ఉన్నారు. గ‌తంలో టీడీపీ చేసిన అవినీతిని, అక్ర‌మాల‌ను, దౌర్జ‌న్యాల‌ను, దోపిడీల‌ను, హ‌త్య‌ల‌ను ఎండ‌గ‌డుతూ వైసీపీ నేత‌లు దూకుడు మీదున్నారు. ఓసారి వైసీపీ నేత‌ల ఆరోప‌ణ‌లు, దూకుడు మ‌చ్చుకు కొన్ని చూస్తే టీడీపీని ఎలా ఇరుకున పెడుతున్నారో తేట‌తెల్ల‌మ‌వుతుంది.


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శ‌ల భాణాలు సందించారు జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌ల కాలంలో 4ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తే ఇది అభినందించ‌కుండా కుసంస్కారంతో చంద్రాలు మాట్లాడుతున్నాడ‌ని విమ‌ర్శ‌లు చేసి చంద్రాలు బ‌ట్ట‌లు చింపి బ‌జారున పెట్టాడు... చంద్రాలు జ‌న్మ‌భూమిల పేరుతో ఎలా దోపిడికి పాల్ప‌డ్డాడో క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లుగా విడ‌మ‌రిచి చెప్పి చంద్రాలు ను ఏకిపారేసాడు ఉమ్మారెడ్డి.


విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాల విషయంలో గత చంద్రబాబు ప్రభుత్వం అవలంభించిన విధానాలపై ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా గిరిజనుల జీవితాలను నాశనం చేసే జీవో నెం. 97 ఇచ్చింది చంద్రబాబు కాదా..? 2015 లో జీవో జారీ చేసినపుడు సీఎంగా ఉన్నది మీరే కదా అంటూ చంద్ర‌బాబుపై దుమ్మెత్తి పోసింది. గత ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల వరకు బార్లకు అనుమతిచ్చారని,  దీనిపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయ‌ణ‌స్వామి చంద్రాలుకు చుర‌క‌లు అంటించారు.


గత ఐదేళ్లలో చంద్రబాబు అవినీతి, లంచగొండి తనం, తప్పుడు విధానాల కారణంగా విద్యుత్‌ సంస్థలకు ఇబ్బంది ఏర్పడిందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చంద్రాలుపై ధ్వజమెత్తారు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర హామీలను నెరవేరుస్తూ జనరంజకంగా పాలిస్తుంటే ప్రతిపక్ష చంద్రబాబు అక్కసుతో అర్థం లేని విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు.


గత ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడి, జీయూవిఎన్‌ఎల్‌ సంస్థ నుంచి గుజరాత్‌ ప్రభుత్వం యూనిట్‌ను రూ. 2.43కు కొనుగోలు చేసి, చంద్రబాబు ప్రభుత్వం తనకు అనుకూలమైన మూడు కంపెనీల నుంచి యూనిట్‌ రూ. 4.84కు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడిందంటూ ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్ చంద్రాలుపై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ మిగులు ఉన్నా.. సంప్రదాయేతర ఇంధనం పేరుతో అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేశారు.


చంద్రబాబు ఎంత రాద్ధాంతం చేసినా జరిగిన అక్రమాలకు శిక్ష అనుభవించక తప్పదని ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.. సంతాప సభను రాజకీయ సభగా మార్చిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆత్మహత్యకు చంద్రబాబు, కోడెల పిల్లలే కారణమంటూ ఆరోపించారు. ఇలా వైసీపీ నేత‌లంతా చంద్రాలుపైన, ఆయ‌న పార్టీపైన విమ‌ర్శ‌లు చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏదేమైనా నీవు నేర్పిన విద్యే నీర‌జాక్షి అన్న‌ట్లుగా ఉంది వ్య‌వ‌హారం..


మరింత సమాచారం తెలుసుకోండి: