గాంధీ జయంతి రోజు గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవానికి తూర్పు గోదావరి జిల్లా కరప వెళ్లిన సీఎం వైఎస్ జగన్ కు అక్కడి విద్యార్థులు సర్ ప్రైజ్ షాక్ ఇచ్చారు. ఇద్దరు విద్యార్థులు తమ టాలెంట్ తో ఏకంగా సీఎం జగన్ కు ఖుషీ చేసేశారు. ముఖ్యమంత్రి జగన్‌పై అభిమానంతో హర్షిత అనే విద్యార్థిని ఏకంగా 4.03 లక్షల ముత్యాలతో ఓ చిత్ర పటం రూపొందించింది. ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాలు పథకాల చిహ్నాలతో ఈ బొమ్మ రూపొందించింది


దాన్ని అక్కడ సీఎం జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇంకో విద్యార్థి సాయి కిరణ్.. జగన్ ప్రజా సంకల్పయాత్రకు సంబంధించిన పేపర్ క్లిప్పింగులు సేకరించి వాటితో సీఎం బొమ్మను రూపొందించాడు. ఇందు కోసం ఆ పిల్లవాడు ఏకంగా 2700 పేపర్‌ క్లిప్పింగ్స్‌ సేకరించాడు . హర్షిత, సాయికిరణ్ రూపొందించిన గిఫ్టులు చూసి సీఎం జగన్ ఫిదా అయ్యారు. వారిని మెచ్చుకున్నారు. వారితో ఫోటోలు కూ దిగారు.


కరపలో గ్రామ సచివాలయం ప్రారంభం ఆద్యంతం హుషారుగా సాగింది. సీఎం జగన్ అందరినీ పలకరించారు. అక్కడి ఉద్యోగులతో మమేకం అయ్యారు. ఉద్యోగుల ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. భుజం మీద చేయి వేసి మాట్లాడారు.. నేరుగా ముఖ్యమంత్రి తమ వద్దకు రావడం, అలా మాట్లాడడంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇదే సమయంలో కొందరు పాదాభివందనం చేయబోగా.. సీఎం అడ్డుకున్నారు.


వారిని జగన్ తన దైన మార్కుతో తలపై చేయి వేసి దీవించారు. ఉద్యోగులతో కూడా గ్రూప్‌ ఫోటోలు దిగారు జగన్. గ్రామ సచివాలయాలను ప్రారంభించిన జగన్.. ఈ సచివాలయాల ద్వారా దాదాపు 500 సేవలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఇది దేశంలోనే ఓ చరిత్ర గా నిలిచిపోతుదని జగన్ అభిలషించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: