ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి వరకూ అసలు నన్ను ఎందుకు ఓడించారు.. నేనేం పాపం చేశాను.. రాష్ట్రానికి మంచి చేయడమే నేను చేసిన నేరమా.. అంటూ కొన్ని సానుభూతి డైలాగులు చెప్పారు. అసలు తాను ఎందుకు ఓడిపోయాడో తనకు అర్థం కావడం లేదంటూ చాలా రోజులు చెప్పుకొచ్చారు.


కానీ ఇప్పుడు తాను ఎందుకు ఓడిపోయాడో అర్థం అవుతోందట. తన ఓటమికి కారణం తెలిసొచ్చిందట. అదేంటో మీరే చూడండి.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలకుఎక్కువ, పార్టీకి తక్కువ సమయం కేటాయించారట. అదే కొంప ముంచిందట. అదే పార్టీకిమరికొంత సమయం వెచ్చించి ఉంటే మొన్నటి ఎన్నికల్లో ఓటమి ఎదురై ఉండేది కాదేమోననిఆయన తాజాగా కామెంట్ చేశారు.


గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం రాత్రి సీబీఎన్ ఆర్మీ సభ్యులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో వైసీపీ చేసిన అసత్య ప్రచారాలతో ప్రజల్లో అపోహలు పెరిగాయట. అదే పార్టీ ఓటమికి దారితీసిందట.


ఇక నుంచి పార్టీలో సమర్థులను గుర్తించి అనుబంధ విభాగాల్లో స్థానం కల్పిస్తారట. అన్ని స్థాయిల్లో పార్టీ వ్యవస్థను పటిష్టం చేసి ప్రజా సమస్యలపై పోరాడతారట. చంద్రబాబు ఫ్యూచర్ ప్లాన్ బాగానే ఉంది. కానీ.. వైసీపీ దుష్ప్రచారం చేస్తే జనం మారిపోతారా.. అంతగా అభివృద్ధి చేసినా కేవలం వైసీపీ ప్రచారంతో జనం వారికి ఓటేస్తారా.. అసలు అభివృద్ధి చేసిన నేతలు జనం ఎక్కడైనా ఓడిస్తారా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు అసలైన ఆత్మపరిశీలన చేయకుండా ఇంకా పాత భ్రమల్లోనే ఉంటే.. ప్రజలతో ఆ దూరం అలాగే కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: