తరచూ యుధ్ధం అంటూ పాకిస్థాన్ కలవరిస్తోంది. అంతేనా అణుయుధ్ధం తప్పదని కూడా హెచ్చరిస్తోంది. మరి యుధ్ధం అంటే అంత సరదా పాక్ కి ఉందేమో. ఇప్పటికి ప్రత్యక్షంగా మూడు యుధ్ధాలు  చేసి అన్నిటా ఓటమిపాలు అయిన పాక్ ప్రచ్చన్న యుధ్ధానికి తెరతీసింది. మూడు దశాబ్దాలుగా భారత్ లోకి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ కల్లోలం స్రుష్టించడం ద్వారా లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది.  ఇపుడు కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం కావడం తో పాక్ మంట అంతా ఇంతా కాదు.


ప్రచ్చన్న యుధ్ధానికి దారులు మూసుకుపోవడంతో అణుయుధ్ధం పాట పాడుతోంది. మరి అణుయుద్ధం కనుక వస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. భారత్ పాక్ ల మధ్య యుధ్ధం వస్తే అది అంతర్జాతీయంగా పెను దుష్పరిణాలకు దారితీస్తుందని ఏకంగా పది కోట్ల మంది చనిపోతారని అమెరికాకు చెందిన న్యూ బ్రూన్స్ విక్ లోని లాట్కెర్స్ యూనివర్శిటీ  సైటిస్టులు చేసిన పరిశోధనలో వెల్లడైంది.


అణుయుధ్ధం జరిగితే ప్రపంచ వినాశనమే అవుతుందని. దేశాలకు దేశాలకు కూడా సర్వనాశనం అవుతాయని ఈ సైటిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ యుధ్ధం వల్ల ప్రపంచవాప్యతంగా వర్షపాతం 15 నుంచి ముప్పయి శాతానికి తగ్గుతుందని కూడా సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ మనుగడ ప్రమాదంలో పడుతుందని కూడా పేర్కొంది. అందువల్ల అణుయుధ్ధం అని కలవరిస్తున్న పాకిస్థాన్ విషయంలో కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


మరి పాక్ ఈ సంగతి తెలిసి కూడా ఉన్మాది లా ప్రవర్తిస్తే  మానవాళి మొత్తం నాశమవుతుంది.  అయితే కాశ్మీర్ అంటూ వూగిపోతున్న పాక్ చెవిన శాంతివచనాలు వినబడతాయా అన్నది సందేహమే. వేయేళ్ళ పాటు అయినా యుధ్ధం చేస్తామని, భారత్ ని వేయి ముక్కలు చేస్తామని శపధం పట్టిన పాకిస్థాన్ చేతికి అణుబాంబులు దొరకడం అంటే అది విపరిణామాలకు దారి తీసే పరిణామమే.




మరింత సమాచారం తెలుసుకోండి: