కేంద్ర మోటారు వాహన సవరణ చట్టం గురించి కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. వామ్మో ఇంత భారీగా చలన్లు ఉంటే కష్టమే అంటూ జనం నిరసన వ్యక్తం చేశారు. ఇంత భారీగా చలాన్లు వేస్తారు సరే.. మరి ప్రజలకు మీరు సమకూర్చే సౌకర్యాలు, రోడ్ల సంగతేంటని నిలదీశారు. అందుకే చాలా రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయడం లేదు.


కొన్ని రాష్ట్రాలు మేం అమలుచేసేది లేదని ఖరాఖండిగా చెప్పేశాయి కూడా. కానీ ఇలా భారీ జరిమానాలు ఉంటేనే ప్రజలకు భయం ఉంటుందన్నది కేంద్రం వాదన. ఇక తెలంగాణలో ఈ చట్టం ఇంకా అమలులోకి వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే ఆ చట్టంలోని భారీ చలానాలకు సమానంగా తాజాగాఓ ఘటనలో కోర్టు జరిమానా విధించింది.


హైదరాబాద్‌లో మొదటిసారి డ్రంకన్‌ డ్రైవ్‌ లో దొరికిన వాళ్లకు జేలులు గుళ్లయ్యాయి. వీళ్లకు భారీ చలానా విధిస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇటీవల పోలీసులకు 9 మంది చిక్కారు. వీరికి ఒక్కొక్కళ్లకు రూ.10,500 చొప్పున జరిమానా విధిస్తూ చలానాలు ఇచ్చారు. అంతే కాదు.. వీరు మరోసారి డ్రంకన్‌ డ్రైవ్‌లో చిక్కితే ఈసారి ఏకంగా రూ.15 వేల దాకా చలానా తప్పదని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.


అందుకే ఇక హైదరాబాద్ లో మందుబాబులు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది.. లేకపోతే.. ఓ 20 వేలు జేబులో ఉంటే తప్ప.. మందు కొట్టి బండి నడిపే సాహసం చేయకూడదు.. ఒకవేళ డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయి.. ఇలా భారీ జరిమానా కట్టి ఇంటికి వెళ్తే ఇంటి వద్ద భార్యలు కూడా బడితె పూజ చేయడం ఖాయం. ఓ చీర కొనిపెట్టమంటే మాత్రం లెక్కలు చెబుతారు..ఇలా తాగి వేలకు వేలు తగలేస్తారా అంటూ భార్యలు నలుగు పెట్టడం మాత్రం ఖాయం. అందుకే బుద్దిగా ఇంట్లోనే తాగితే ఏ గొడవా ఉండదు. అసలు తాగకపోతే ఇంకా మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: