మానవ శరీరంలోని అవయవాలు చలనం కోల్పోతే వచ్చే వ్యాధిని పక్షవాతం అంటారు. పక్షవాతం వలన కాళ్లు చేతులు మెలితిరిగిపోవడం, శరీరం బిగుసుకుపోవడం, గుండె సరిగా పనిచేయకపోవడం, మూతి వంకర తిరిగిపోవటం ఇలా శరీరంలోని ముఖ్య అవయవాలపై పక్షవాతం ప్రతికూల ప్రభావం చూపుతుంది. రోజుకు సగటున 2,000 మంది వరకు భారదేశంలో ఈ వ్యాధి వలన చనిపోతున్నారని తెలుస్తుంది. 
 
ధూమపానం, మద్యపానం, గుండెజబ్బులు ఉన్నవారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పక్షవాతం రావటం వలన కాళ్లు, చేతులు పడిపోతే ఆ మనిషి మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది. పక్షవాతం వచ్చిన వ్యక్తులు నిలబడటం కూడా అంత తేలిక కాదు. కానీ పక్షవాతం వచ్చినా కూడా నిలబడేలా చేసిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. 
 
టెలీప్లెజిక్స్ అనే కొత్త టెక్నాలజీని ఉపయోగించి పక్షవాతం వచ్చిన ఫ్రాన్స్ వాసిపై శాస్త్రవేత్తలు, వైద్యులు కలిసి పరిశోధనలు చేశారు. శరీరంలోని మెదడుని నియత్రించటం కొరకు శరీరం బయట అస్తి పంజరాన్ని ఏర్పాటు చేసి చేసిన పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. థిబాల్ట్ అనే 28 ఏళ్ల వ్యక్తి భవనంపై నుండి కింద పడ్డాడు. కింద పడటం వలన భుజం నుండి కింది భాగం వరకు థిబాల్ట్ కు పక్షవాతం వచ్చింది. 
 
శాస్త్రవేత్తలు కనిపెట్టిన టెలీప్లెజిక్స్ అనే టెక్నాలజీ సహాయంతో డాక్టర్లు థిబాల్ట్ కు చికిత్స చేశారు. ప్రస్తుతం థిబాల్ట్ చక్కగా నడుస్తున్నాడు. ఈ టెక్నాలజీలో కంప్యూటర్ ద్వారా మెదడు నుండి సిగ్నల్స్ తో పాటు శరీరం బయట ఉన్న అస్తి పంజరాన్ని నియంత్రించటం జరుగుతుంది. సినాటెక్ శాస్త్రవేత్తలు మరియు గ్రెనోబెల్ హాస్పిటల్ వైద్యులు కలిసి థిబాల్ట్ పై చేసిన పరిశోధనల్లో విజయం సాధించారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే పక్షవాతం వచ్చిన వారు సులభంగా నడిచే అవకాశం ఉంటుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: