దేవుళ్లు ఉన్నది ఎందుకు భక్తుల కోర్కెలు తీర్చేందుకు అంటారు కొందరు. అందుకే మనకు ఏవైనా కోరికలు ఉంటే దేవుళ్లకు మొక్కుకుంటాం.. ఆ మొక్కు తీరితే వెళ్లి ఆ దేవుళ్లకు మొక్కులు సమర్పించుకుంటాం. సెలబ్రెటీలు కూడా ఇందుకు అతీతులు కారు. వైసీపీలో పవర్ ఫుల్ లీడర్ గా ఉన్న ఆర్కే రోజా కూడా గత ఏడాది బెజవాడ దుర్గమ్మను ఓ కోరిక కోరిందట.


బెజవాడ దుర్గమ్మ ఏడాది తిరిగే లోపల ఆకోరిక తీర్చిందట. ఇంతకీ రోజా ఏం కోరిక కోరింది. ఇదే కదా మీ డౌట్.. తాను ఎమ్మెల్యేగా గెలవాలనో.. మరేదో కోరుకోలేదు ఆమె. ఆమె తన కోసం కాకుండా వైసీపీ కోసం కోరిక కోరిందట. గత సంవత్సరం నవరాత్రి రోజుల్లో మూలా నక్షత్రం రోజున తాను బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ఓ కోరిక కోరుకున్నానని, అది తీరడంతో ఈ సంవత్సరం తిరిగి అమ్మను దర్శించుకుని, మొక్కు తీర్చుకున్నానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా కామెంట్ చేసింది.


శనివారం ఉదయం సరస్వతీ దేవి అలంకారంలో భక్తులను కరుణిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న ఆమె, అనంతరం మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం ఇదే రోజున తాను జగన్ సీఎం కావాలని మొక్కుకున్నానని అన్నారు. తన కోరికను అమ్మ నెరవేర్చిందని చెప్పారు. తన పాలనా విధుల్లో వైయస్‌ జగన్ కు ఎటువంటి ఆటంకాలూ లేకుండా చూడాలని ఈ సంవత్సరం అమ్మను కోరానని తెలిపారు.


ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయని, అధికారులు మెరుగైన ఏర్పాట్లు చేశారని అన్నారు. భక్తులు అమ్మను ప్రశాంతంగా దర్శించుకుంటున్నారని రోజా తెలిపారు. మరి ఇంతకీ ఈ ఏడాది రోజా కోరింది కూడా అమ్మవారు తీరుస్తుందా.. లేదా.. అన్నది ఓ ఏడాది ఆగితే కానీ తెలియదు కదా.. ఏమంటారు..?


మరింత సమాచారం తెలుసుకోండి: