ప్రధాని మోడీని కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రధానంగా పోలవరం అంశాన్ని .. ఆ ప్రాజక్టు పూర్తి చేసేందుకు కావాలసిన కేంద్ర సహకారం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకూ జరిగిన పనుల తీరును జగన్ మోడీకి వివరించినట్టు తెలిసింది. పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాలు ఆమోదించాలని మోదీకి జగన్ కోరారు.


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులు రూ.5,103 కోట్లను ప్రాజెక్టుకోసం ఖర్చు చేసిందని జగన్ మోడీకి వివరించారు. ఆ నిధులను తక్షణమే రీయింబర్స్‌ చేయాల్సి ఉందని గుర్తు చేశారు. ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి మరో రూ.16 వేల కోట్లు విడుదల చేయాలని జగన్ మోడీని కోరారు. ప్రాజెక్టు కోసం ఇంకా భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉందని.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మొత్తం రూ. 55,548 కోట్లు ఆమోదించాలని మోడీకి జగన్ విజ్ఞప్తి చేశారు.


ఈ మొత్తంలో భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకే దాదాపు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని జగన్ మోడీకి వివరించారు. ఈ సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను జగన్ మోడీకి వివరించారట. 2014–19 మధ్య పోలవరం పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ వేసినట్టు మోడీకి జగన్ తెలిపారు.


ఆ నిపుణుల కమిటీ అభిప్రాయం మేరకు పాత కాంట్రాక్ట్‌లను రద్దు చేశామని.. రివర్స్ టెండరింగ్ ను నిర్వహించామని మోడీకి జగన్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులను రివర్స్‌ టెండరింగ్‌ చేయడం ద్వారా దాదాపు రూ.838 కోట్లు ఆదా అయ్యాయని.. ఇందులో హెడ్‌ వర్క్స్, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు పనుల మొత్తం రూ.780 కోట్లు కాగా, టన్నెల్ పనులకు సంబంధించిన రూ.58 కోట్లు ఆదా అయ్యాయని జగన్ మోడీకి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: