ఏపీ సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అధికారం అండతో రెచ్చిపోయిన సొంత పార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేయించారు. జగన్ నిర్ణయంతో వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కోటంరెడ్డి బెదిరించారంటూ ఎంపీడీవో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. కోటంరెడ్డిని అరెస్ట్ చేశారు.


ఈ నిర్ణయం టీడీపీకి షాకింగ్ గా మారింది.. ప్రత్యేకించి చంద్రబాబు ఈ జగన్ నిర్ణయం చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి.. ఎందుకంటే గతంలో చంద్రబాబుకు ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ఇసుకు వ్యవహారంలో ఏకంగా ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయనా అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేనే.


ఈ విషయంపై అప్పట్లో చాలా దుమారం రేగింది. పత్రికలు పుంఖానుపుంఖాలుగా కథనాలు రాశాయి. కానీ అప్పటి సీఎం చంద్రబాబు చింతమనేనిపై ఈగ వాలనీయలేదు. పైగా బాధితురాలిని పిలిపించుకుని వ్యవహారం సెటిల్ చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పటి వ్యవహారాన్ని అప్పటి వ్యవహారాన్ని పోల్చి చూస్తే జగన్, చంద్రబాబు మధ్య తేడా స్పష్టంగా తేలిపోతుంది.


తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారానికి వస్తే.. ఈ ఘటన జరిగిన సమయంలో సీఎం జగన్ రాష్ట్రంలోలేరు.. ప్రధానిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బిజిగా గడిపారు. జగన్ ఢిల్లీ నుంచి రాగానే.. నెల్లూరు ఘటనపై ఆరా తీశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీజీపీ గౌతం సవాంగ్‌ సీఎంకు వివరాలు నివేదించారు.. చట్టం ముందు అందరూ సమానమేనని డీజీపీకి సీఎం స్పష్టంచేశారు. చట్టాన్ని ధిక్కరించేవారు ఎవ్వరైనా ఉపేక్షించవద్దని డీజీపీకి జగన్ ఖరాఖండిగా చెప్పారు.


ఆధారాలు ఉంటే... చట్టప్రకారం ఏ చర్యకైనా వెనకాడవద్దని డీజీపీని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అంతే.. వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో చంద్రబాబు నిర్ణయానికి ఇప్పటి జగన్ నిర్ణయానికి ఎంత తేడా అంటూ జనం ఆశ్చర్యపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: