తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ సీఎం అన్నారు.


చట్ట విరుద్ధమైన సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారి చేసింది తీవ్రమైన తప్పిదమని ముఖ్యమంత్రి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఆర్టీసీకి సంబంధించి, ఎప్పటికీ క్రమ శిక్షణా రాహిత్యం, బ్లాక్ మెయిల్ విధానం, తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వతంగా వుండకూడదని ప్రభుత్వం భావిస్తున్నదని కూడా ముఖ్యమంత్రి చెప్పారు.


గడువు పూర్తి అయ్యేలోపల, అంటే ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది లోపే సిబ్బంది అని సీఎం అన్నారు. అద్దె బస్సులతో ఆర్టీసీని నడిపించాలని.. కొత్త ఉద్యోగులను తీసుకోవాలని.. ఆర్టీసీని విలీనం చేయకూడదని కేసీఆర్ మొండి పట్టుదలతో ఉన్నారు. కానీ కేసీఆర్ నిర్ణయం చూస్తే.. ఇది మరింత క్లిష్టమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.


తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన లేఖలో చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటే కార్మికులతో అమీ తుమీ తేల్చుకునేందుకు కేసీఆర్ సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఆర్టీసీ చిన్న సంస్థ కాదు.. దాదాపు 50 వేల మంది ఉద్యోగులకు సంబంధించిన విషయం.. అందులోనూ వారి సమ్మె పండుగ సమయంలో చేశారన్న విషయం తప్పించి వారి డిమాండ్లలో న్యాయముందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సమస్య పరిష్కారం వైపు ఆలోచించకుండా కేసీఆర్ కొరివితో తలగోక్కుంటున్నారా అన్న అభిప్రాయం విశ్లేకుల్లో వ్యక్తమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: