ఆర్టీసీ.. ప్రజారవాణాలో అతి పెద్ద భాగస్వామి.. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే అసలు ఈ ఆర్టీసీ ఎలా పుట్టింది.. ఇందుకు ఓ ఆసక్తికరమైన చరిత్ర ఉంది. హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించిన ఆరో నిజాం కు ఇద్దరు కోడళ్లలో ఒకరు జోహ్రా బేగం ఈమె టర్కీ రాకుమారి. ఈమెకు పెళ్లిలో తల్లి తండ్రులు బంగారం, వజ్రాలు తో పాటు మనోవర్తీ అనగా మహర్ రూపంలో 9 కోట్ల రూపాయలు ఇచ్చారు.


ఒక రోజు రాకుమారి గారు నగరం లో పల్లకిలో వెళ్తున్న సమయంలో చాలా మంది.. నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు దిగీ నెత్తిన సామానులు పెట్టె పెట్టుకుని చిన్న పిల్లలు. ముసలి వారు. వికలాంగులు రోడ్డు వెంట నానా కష్టాలు పడుతూ వెళ్తున్నారు. రాకుమారి వారి ని ఆపి ఎక్కడి నుండి వస్తునారు అని అడిగింది. వారు కొందరు నాందేడ్, మరి కొందరు ఔరంగాబాదు, మరి కొందరు వరంగల్ అని చెప్పారు..


నడిచే వస్తున్నామంటూ ఏడ్చారు.. అప్పుడు రాకుమారి.. అందరూ భగవంతుడు సృష్టించిన మనషులమే, నేను పల్లకిలో వెళ్ళటం ఎందుకు ప్రజలు కష్టాలు పడటం బాగలేదు అని తీవ్రంగా ఆలోచన చేశారు. వారి మామ గారు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలిఖాన్ గారి అనుమతి సహకారాన్ని తీసుకుని తన స్వంత డబ్బులు ఖర్చు చేసి 9 బస్సు డిపోలు ఎర్పాటు చేయించారు.


50 బస్సులు కొని హైదరాబాద్, నాందేడ్, వరంగల్, ఫర్భనీ, గుల్బర్గా, రాయచూరు, వనపర్తి లలో బస్సు డిపో ల నుండి రైలు స్టేషన్ కు బస్సులు వెళ్లేందుకు సౌకర్యం కల్పించారు. దానికి నిజాం స్టేట్ రైల్వే - రోడ్డ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ అని పేరు పెట్టారు. అదే ఆ తర్వాత కాలంలో ఆర్టీసీగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: