తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అక్కడి ప్రజల కోర్కెను గౌరవించానే తప్ప ఆంధ్రా ప్రాంతాన్ని కానీ.. ప్రజలని కానీ ఎప్పుడు వ్యతిరేకించలేదని దేవులపల్లి అమర్ అన్నారు. ఆయన ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. దేవులపల్లి అమర్ తెలంగాణకు చెందిన వ్యక్తి. సాక్షి టెలివిజన్ లో చాలాకాలం యాంకర్ గా పని చేశారు.


రాజకీయ చర్చలు నిర్వహించేవారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎం అయిన తర్వాత దేవులపల్లి అమర్ కు అదృష్టం కలిసివచ్చింది. ఆయన్ను ఏపీ ప్రభుత్వ సలహాదారుగా జగన్ అవకాశం కల్పించారు. ఏకంగా ఆయనకు కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన జర్నలిస్టుల సంఘాలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాయి.ఈ కార్యక్రమంలో మాట్లాడిన అమర్ ఎన్నో విషయాలను పాత్రికేయులతో పంచుకున్నారు.


ఒక అధికారి ప్రభుత్వ సలహాదారుగా ఉండటం కన్నా పాత్రికేయుడు ప్రభుత్వ సలహాదారుగా ఉంటేనే మంచిదన్నారు. అప్పుడే ప్రభుత్వ సామర్ధ్యం, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం బాగుంటుందని దేవులపల్లి అమర్ అభిప్రాయపడ్డారు.ఏ ప్రభుత్వానికైనా తప్పనిసరిగా మీడియా సలహాదారు ఉండాలని.. అప్పుడే ఆ ప్రభుత్వ పని తీరు ప్రజల్లోకి వెళ్తుందని దేవుల పల్లి అమర్ అన్నారు. ఈ రోజుల్లో మీడియా బాగావిస్తరించిందన్నారు.


అసలు విమర్శ అనేది ఉండకూడదు అని ఏ ప్రభుత్వం అనుకుంటుందని తాను అనుకోవడంలేదన్నారు దేవులపల్లి అమర్.ప్రజాస్వామ్యంలో విమర్శ ఉంటేనే ప్రభుత్వాల పని తీరు మెరుగా ఉంటుందని దేవులపల్లి అమర్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా దేవులపల్లి అమర్ కు క్యాబినెట్ హోదా ఉన్నందువల్ల ఆయనకు ఎన్నో సౌకర్యాలు సమకూరనున్నాయి. దాదాపు తొమ్మిది మంతి వరకూ సిబ్బందిని ఆయన నియమించుకోవచ్చు. ఆయన కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. దేవులపల్లి అమర్ సలహాలు ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: