ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలలో తెలుగు రాష్ట్రాలలోనే కొన్ని వందల మంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి నుంచి చింతూరు మధ్య ఓ పర్యాటక బస్సు నేడు ప్రమాదానికి గురైంది.     

                       

ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఈ ఘటనలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారికీ కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. 

                             

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలాన్ని సమీక్షిస్తున్నారు. బస్సు మారేడుమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ రహదారి చాలా ప్రమాదకరమైనది అని, అక్కడ కేవలం ఎక్కువ నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే నడుపుతారని, కొత్తవారు నడిపితే ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. 

                              

కాగా మారేడుమిల్లి నుంచి చింతూరుకు వెళ్లే రహదారిలో లోయలు, గుట్టలు ఎక్కువ ఉన్నాయని, ఆ రహదారి చాలా ప్రమాదకరంగా ఉంటుంది అని ఇటీవలే పడిన భారీ వర్షాలకు మరింత ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెప్తున్నారు. 

                        

మరింత సమాచారం తెలుసుకోండి: