ఎన్నో ఏళ్లుగా ఏపీని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే..అది నిరుద్యోగం. దాదాపు దశాబ్ద కాలంలో ఈ నిరుద్యోగ సమస్య తారస్థాయికి చేరుకుంది. ఏటా గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతుంది గానీ...వారికి తగిన స్థాయిలో ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఐదు సంవత్సరాలకొకసారి ప్రభుత్వం మారింది గానీ...నిరుద్యోగుల తలరాత మాత్రం మారలేదు. ఈ క్రమంలోనే గత ఐదేళ్లు ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలని తెలుసుకున్నారు. అలాగే ఏపీని ఇబ్బంది పెడుతున్న నిరుద్యోగ సమస్యని కూడా గుర్తించారు.


దీంతో ఆయన నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారంలోకి రాగానే గ్రామ/వార్డు వాలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల పేరిట కొత్త వ్యవస్థలని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే ఇచ్చిన హామీలని నిలబెట్టుకున్నారు. వాలంటీర్లు, సచివాలయాల పేరిట దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పని చేస్తూ ప్రతి ప్రభుత్వ పథకాలని ప్రజలకు అందిస్తున్నారు.


అటు ప్రతి గ్రామ పంచాయితీని సచివాలయంగా మార్చి అక్కడ దాదాపు 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అలా రాష్ట్రం మొత్తం దాదాపు 1.27 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇక ఇవేగాక వైన్ షాపులని ప్రభుత్వాలు నడుపుతూ...అందులో కూడా నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించారు. వీటితో పాటు నిరుద్యోగులకు మేలు కలిగేలా స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని జగన్ నిర్ణయం తీసుకుని , దానిని అమలు చేస్తున్నారు.


అలాగే కేవలం ఈ ఉద్యోగాల విప్లవాన్ని ఇంతటితో ఆపకుండా ప్రతి ఏడాది కొనసాగించాలని జగన్ ప్లాన్ చేశారు. అందుకే ప్రతి ఏడాది జనవరిలో ఖాళీలు ఉన్న ప్రతి పోస్టుని భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. దీని ప్రకారం రాబోయే జనవరిలో మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇలా ఐదు నెలల్లోనే నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టిన జగన్....ఐదేళ్లలో నిరుద్యోగం మాటే లేకుండా చేస్తారనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: