గుంటూరు జిల్లా మంగళగిరిలో డీఎస్పీ పాసింగ్ అవుట్ పరేడ్ లో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి సుచరిత పాల్గొన్నారు. పాసింగ్ అవుట్ అయిన డీఎస్పీలు ఏడాది పాటు అనంతపురం పీటీసీలో శిక్షణ పొందారు. 25 మంది డీఎస్పీలు పీటీసీలో శిక్షణ పొందగా వారి గురించి ఏపీ డిజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ ఈరోజు పాసింగ్ అవుట్ అయిన పోలీసులు రాష్ట్రానికి వెన్నముకలాంటివారని అన్నారు. టెక్నికల్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని గౌతమ్ సవాంగ్ సూచించారు. 
 
ఈరోజు పాసింగ్ అవుట్ అయిన డీఎస్పీలు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా రోల్ మోడల్స్ గా నిలవాలని కోరారు. గౌతమ్ సవాంగ్ పాసింగ్ అవుట్ అయిన 25 మంది డీఎస్పీలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మంత్రి సుచరిత మాట్లాడుతూ డీఎస్పీ పాసింగ్ అవుట్ పరేడ్ కు హోం మంత్రిగా హాజరు కావటం ఎంతో సంతోషంగా మరియు గర్వంగా ఉందని చెప్పారు. 
 
మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఎంపికైన 25 మంది డీఎస్పీలలో 11 మంది మహిళా డీఎస్పీలు ఉండటం మరింత ఆనందంగా ఉందని అన్నారు. డీఎస్పీలు ప్రదర్శించిన అద్భుతమైన పరేడ్ కు సుచరిత హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో అనేక సవాళ్లు, అడ్డంకులు ఎదురవుతాయని వాటన్నిటినీ విజయవంతంగా ఎదుర్కోవాలంటే ధైర్యం, సంకల్పం, ఉన్నత విలువలతో వ్యవహరించాలని అన్నారు. 
 
సుచరిత మాట్లాడుతూ సమాజంలో బలహీనవర్గాలపై జరిగే హింసను నిర్మూలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పెరుగుతున్న నేరాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని అన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం ఎదుర్కోవటానికి సమాయత్తమై ఉండాలని అన్నారు. పోలీస్ జీవితం శారీరక శ్రమతో కూడుకున్నదని అన్నారు. యువ అధికారులకు మరియు వారి కుటుంబ సభ్యులకు సుచరిత శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు అవార్డు గ్రహీతలలో ఎక్కువమంది మహిళలు ఉన్నారని అన్నారు. జెస్సీ ప్రశాంతి బెస్ట్ పరేడ్ కమాండర్ గా ఎంపికయ్యారని అన్నారు. 


 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: