తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో ఎమ్మెల్యేలు సైడ్ బిజినెస్ స్టార్ట్ చేశారా?  గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అప్ప‌ట్లో చేతికి ఎముక లేకుండా ఖ‌ర్చు చేశారు. ఈ క్ర‌మంలో కొంద‌రు భారీ వ‌డ్డీల‌కు అప్పులు తెచ్చారు. ఇకొంద‌రు ఇళ్లు, పొలాలు, స్థలాల‌ను కూడా అమ్ముకున్నారు. అయితే, చ‌చ్చీచెడీ విజ‌యం అయితే సాధించారు.  ఈ క్ర‌మంలోనే వారు పోగొట్టుకున్న వాటిని రాబ‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు త‌మకు తోచిన రీతిలో సైడ్ బిజినెస్‌లు ప్రారంభించార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.


ఒకవైపు అధికారాన్ని అనుభ‌విస్తూనే మరోవైపు కొందరు రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో, మరికొందరు ఇతర వ్యాపారాల్లో బిజీ అయ్యారట. అందుకే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు  వెతికినా కనబపడటం లేదట. కొంద రు ఎమ్మెల్యేలు అడపాదడపా చిన్నచిన్న షాపుల ఓపెనింగ్ కు వస్తూ అలా మెరిసిపోతున్నారట. ఓ ఎమ్మె ల్యే పార్లమెంట్ ఎన్నికల నుంచి నియోజకవర్గానికి ముఖం చాటేశారట. విదేశాల్లో ఉన్న తన వ్యాపారాల్లో సదరు ఎమ్మెల్యే బిజీ అయ్యారనే టాక్ నడుస్తోంది. అభివృద్ది పనులకు నిధులు లేక, పనులు మధ్యలో ఆగిపోవడం, నియోజకవర్గ నిధులు తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయం వైపు దృష్టిపెట్టారనే టాక్ నడుస్తోంది.


ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు ఖర్చులను రాబట్టుకునేందుకు బిజినెస్ మెన్ అవతారం ఎత్తారట. చాలా మంది కాంట్రాక్టర్లు, బిల్టర్లుగా ఉండి, రాజకీయ ఆరగేంట్రం చేశారు. మొదటిసారి ఈజీగా గెలిచారు. రెండోసారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ ఖర్చులు రాబట్టుకునేందుకు సర్కారు పనులపై ఆశ లేకపోవవడంతో పాత బిజినెస్ లపై దృష్టి పెట్టారట ఇందూరు ఎమ్మెల్యేలు. ఇంకో ఎమ్మెల్యే ఓ అడుగు ముందుకేసి భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్ల కోసం ఓ గ్యాంగ్ ని సిద్దం చేశారనే టాక్ నడుస్తోంది.


ఇంకొకరు ఓ కార్పొరేషన్ స్ధలాన్ని లీజుకు తీసుకుని, భారీ షాంపిగ్ కాంప్లెక్స్ కట్టేశారట. ఇలా చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి రాకుండా, బిజీగా మారిపోయారట. ఎమ్మెల్యేల బిజినెస్ ల విషయం, అధిష్ఠానానికి తెలిసినా ఐతే ఓకే అంటున్నారట. ఎన్నికల సంవత్సరం వరకు తమ సొంత వ్యాపారాలు బాగు చేసుకుని, చివరి సంవత్సరం నియోజకవర్గంలోనే ఉండాలనే ప్లాన్ తో ఉన్నారట శాసన సభ్యులు. ఐతే నియోజకవర్గాల ప్రజలు మాత్రం ఎమ్మెల్యేల కోసం, కార్యాలయాల చుట్టు చెప్పులరిగేలా తిరుగుతున్నా, కంటికి కనిపించడం లేదని అంటున్నారు. ఇదీ.. ఇప్పుడు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల సైడ్ బిజినెస్ బాగోతం.


మరింత సమాచారం తెలుసుకోండి: