తెలంగాణలో టీడీపీ ఇంకా ఉందా అంటే? డౌట్ అనే చెప్పాలి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఇప్పుడు తెలంగాణలో క్లోజ్ అయిపోయినట్లే చెప్పాలి. రాష్ట్రం విడిపోయాక ఎక్కువ శాతం టీడీపీ నేతలు టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. ఇక మరికొందరు కాంగ్రెస్ లోకి వెళ్లారు. అయితే పార్టీ ఉనికి చాటేందుకు చంద్రబాబు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బద్ద శత్రువు కాంగ్రెస్ తో పెట్టుకుని టీఆర్ఎస్ తో పోటీ పడ్డారు. కానీ పొత్తు ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ 19 స్థానాలకు పరిమితమైతే టీడీపీ కేవలం 2 స్థానాలని గెలుచుకుంది.


ఇక ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మిగిలిన నేతలు తట్టా బుట్టా సర్దేసుకుని టీఆర్ఎస్, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. దీంతో తెలంగాణలో దాదాపు తెలుగుదేశం క్లోజ్ అయిపోయింది. ఏదో ఒక 5 శాతం నేతలు పార్టీలో మిగిలి ఉన్నారు. ఈ క్రమంలోనే హుజూర్ నగర్ ఉపఎన్నికలు వచ్చాయి. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ కు మద్ధతిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా తెలంగాణ నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి పార్టీ అభ్యర్ధిని బరిలోకి దించారు. 


చావా కిరణ్మయి బీ ఫామ్ తీసుకుని నామినేషన్ వేసి ప్రచారం మొదలుపెట్టారు. మిగతా టీడీపీ నేతలు కూడా ఆమె తరుపున ప్రచారం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ కూడా ఆమె తరుపున ప్రచారం చేయనున్నారు. అయితే ఎవరు ప్రచారం చేసిన ఇక్కడ టీడీపీకి అంత సీన్ లేదు. ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యే జరుగుతుంది. వారిలో ఒకరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని రాజకీయ విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు. 


2014లో టీడీపీకి ఇక్కడ 25 వేలు ఓట్లు వరకు వచ్చాయి. కానీ అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. టీడీపీ డిపాజిట్ దక్కించుకోవడం కూడా కష్టమే. టీడీపీకి ఓటు వేస్తే ఉపయోగం ఉండదని ఓటర్లకు ఈ పాటికే అర్ధమైపోయింది. కాబట్టి టీడీపీ అనవసరంగా పోటీ చేస్తూ పరువు పోగొట్టుకోవడం ఖాయం. చూద్దాం మరి ఫలితాలు ఎలా వస్తాయో.  


మరింత సమాచారం తెలుసుకోండి: