వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దళితుల భావ, వాక్‌ స్వేచ్ఛను హరించేలా దళితులపై చర్యలు తీసుకుంటూ, వారిపై ఎమర్జెన్సీ విధించినట్లుగా వ్యవహరిస్తోందని టీడీపీనేత, మాజీ మంత్రి కే.ఎస్‌.జవహర్‌ మండిపడ్డారు. జగన్‌ బాబాయి వైఎస్‌.వివేకా హత్యజరిగి 200రోజులు దాటిపోయినా ఆకేసులో సరైనవిచారణ జరపలేని ప్రభుత్వం, హత్యకేసు గురించి మాట్లాడారన్న అక్కసుతో పనిగట్టుకొనిమరీ దళితనేతలను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురిచేయడమేంటని ఆయన నిలదీశారు. 

వివేకాహత్యకేసు దర్యాప్తుతీరు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే వర్ల రామయ్య చేసిననేరమా అని జవహర్‌ ప్రశ్నించారు. వివేకా హత్యజరిగిన తొలిరోజే, బాధాతప్తహృదయంతో మాట్లాడిన విజయసాయిరెడ్డిగారు   , వివేకానందరెడ్డి గుండెనొప్పితో చనిపోయారని చెప్పగా, తరువాత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి , ఇతరరెడ్డినేతలు హత్యపై స్పందించినప్పుడు చర్యలు తీసుకోని వైసీపీ ప్రభుత్వం, నేడు  వర్లరామయ్యగారికే నోటీసులు ఇవ్వడం కక్షసాధింపుల్లో భాగమేనని జవహర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.


 ప్రభుత్వవైఖరి చూస్తుంటే ఉత్తరాదిరాష్ట్రాల్లో దళితులపై వ్యవహరించే తీరుకన్నా దారుణంగా ఉందన్నారు. హత్యజరిగి ఇన్నిరోజులైనా దోషులను పట్టుకోలేని ప్రభుత్వవైఖరి చూస్తుంటే, ఆయనప్రాణం తీసిన వ్యక్తులపట్ల సర్కారుఎలాంటి ఉద్దేశంలో ఉందో స్పష్టమవుతోందన్నారు. వర్లరామయ్యను వేధించడమంటే, దళితుల మనోభావాలతో ఆడుకోవడమేననే విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని కే.ఎస్‌. హెచ్చరించారు. 


గోదారి పడవ ప్రమాదంపై మాట్లాడిన నేరానికి దళితుడైన మాజీఎంపీ హర్షకుమార్‌పై పలుసెక్షన్ల కింద ప్రభుత్వం కేసులు నమోదుచేసిందన్నారు. రెండుసార్లు ఎంపీగా ఉన్న వ్యక్తిని వేధిస్తూనే, రామయ్యగారి మనోధైర్యం దెబ్బతీసేలా నోటీసులివ్వడం, సిట్‌ను పురిగొల్పడం వంటి చర్యలతో రాష్ట్రంలో దళితులపై ఎమర్జెన్సీ విధించారా అనే అనుమానం కలుగుతోం దన్నారు. దళితులు ఏమిమాట్లాడాలో..ఎలా ప్రవర్తించాలో ప్రభుత్వమే మార్గదర్శకాలు ఇస్తుందా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం పోలీసులకు ఫ్యాషన్‌గా మారిందన్న జవహర్‌, వివేకా హత్యకేసులో రామయ్యకన్నా ముందు మాట్లాడినవారిపై కూడా ఇలానే ప్రవర్తించారా అని నిగ్గదీశారు. మీసాలు మెలేసి ఎంపీ అయిన గోరంట్లమాధవ్‌ని స్ఫూర్తిగా తీసుకొని, ప్రతిఒక్కరూ అలానే చేయడం దురదృష్టకరమ న్నారు. 



ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదంటూ, తెలంగాణ పోలీసులను సమర్థించిన జగన్‌ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు తమవైఖరి మార్చుకోవాలన్నారు. దళితుల ఐకాన్‌గాఉన్న రామయ్యకు పోలీసులపట్ల, ఆవ్యవస్థపట్ల అమితమైన గౌరవము ందని, అలాంటివ్యక్తి మానసికధైర్యాన్ని దెబ్బతీయాలనిచూస్తే, ఊరుకునేది లేదని, ఆయనకు అండగానిలిచి, దళితుల ప్రయోజనాలు కాపాడుకుంటామని జవహర్‌ తేల్చిచెప్పారు. దళితులపై కక్షసాధింపుగా పెడుతున్న కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోక పోతే, దళితసంఘాలతో కలిసి ప్రభుత్వం మెడలువంచేలా పోరాటం చేస్తామని మాజీమంత్రి  రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించారు.      


మరింత సమాచారం తెలుసుకోండి: