ప్రస్తుతం చిన్నారులపై రోజు రోజుకి పెరిగిపోతోన్న దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగింది. సోషల్ మీడియా ద్వారానే ఈ అకృత్యాలు ఎక్కువగా జరుగుతుండటంతో సామాజిక మాధ్యమాలపై దృష్టి సారించారు.


ఈ నేపథ్యంలోనే ఒక పోలీస్ అధికారి కైలీ అనే బాలిక పేరుతో నకిలీ పేస్ బుక్  ఖాతాను క్రియేట్ చేయడం జరిగింది. తన వయసు 14 ఏళ్లని, విస్కాన్సిన్లోని నిన్హా ప్రాంతంలో నివసిస్తున్నట్లు ప్రొఫైల్లో తెలియచేసాడు. అలా తన అకౌంట్ నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపించాడు. ఈ క్రమంలో ఇండియానాకు చెందిన టామీలీ జెంకి సదరు రిక్వెస్టు యాక్సెప్ట్ చేశాడు.

కొద్దిరోజుల పరిచయం తర్వాత జెంకిన్స్.. ప్రతిరోజూ లైంగిక పరమైన అంశాలు చర్చించడం మొదలు పెట్టడం చేశాడు.
దానితో పాటు నగ్న ఫోటోలు పంపించాల్సిందిగా కోరేవాడు అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కైలీని తనను కలవాల్సిందిగా కోరాడు. దీనికి అటువైపు నుంచి అంగీకారంతో రావడంతో ఇండియానా నుంచి విస్కాన్సిను నడవటం ప్రారంభించాడు. ప్రయాణంలోని వివిధ ప్రాంతాల్లో దిగిన ఫోటోలను కైలీకి పంపించాడు. జెంకిన్సను నిశితంగా గమనిస్తున్న అధికారులు నిన్హాకు చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. 


సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలికను ప్రేరేపించడం, ప్రలోభపెట్టినందుకు గాను జెంకిన్సను అదుపులోకి తీసుకున్నారు. అలా మైనర్ బాలికతో శృంగారం కోసం జెంకిన్స్ 565 కిలోమీటర్లు నడిచి చివరికి బొక్కబొర్లాపడ్డాడు. ఈ నెల 23న అతనిని కోర్టులో హాజరు పెడతారు. ఈ కేసులో దోషిగా తేలితే.. జెంకిను 10 ఏళ్ల జైలు శిక్షపడే అవకాశముంది అని సమాచారం. ఇలాంటి వారిమీద కోర్టు ఏవిధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి. పేస్ బుక్లో నకిలీ అకౌంట్స్ తో ఇలా చాల మంది బాలి అవుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: