తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొన్న దసరా పండుగా సందర్బంగా మద్యం రేట్లు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యాన్ని విక్రయిస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తాం అని చెప్పిన విషయం గుర్తే ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా అదే రీతిలో జరిమానాలు, జైలు శిక్ష విధించాలని సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.    

    

ఇంకా విషయానికి వస్తే.. రాష్ట్రంలో నవంబర్1, 2019 నుంచి మొదలయ్యే మద్యం దుకాణాల్లో విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేసింది. మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులు, రాజకీయ నాయకులు కొంతమంది ఒక్కటయ్యారు. తమకు తోడుగా కొందరు శ్రీమంతులనూ జత చేసుకొని సిండికేట్‌గా మారి మద్యం దుకాణాలను దక్కించుకునేలా వ్యూహం పన్నారు.     

      

అయితే ఈ విషయం ఎక్సైజ్‌ శాఖ దృష్టికి ఫిర్యాదులు రావడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు కటినంగా స్పందించారు. మద్యం సిండికేట్ల రూపంలో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా అనైతిక మార్గాల్లో మద్యం వ్యాపారం చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తెలంగాణ ఎక్సైజ్ చట్టం 36బీ, 41ల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.    

    

కాగా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం అమ్మితే చట్ట ప్రకారం 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నట్టు ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఎక్సైజ్‌ శాఖ నుంచి మరో రూ.2 నుంచి 3 లక్షల అపరాధ రుసుము కట్టేలా నిబంధనలు రూపొందించారు. ఏమైతేనేం ఇంకా ఎమ్మార్పీ రేటు కంటే ఒక్క రూపాయి కూడా మందుబాబులు చెల్లించాల్సిన అవసరం లేదు.     

    

మరింత సమాచారం తెలుసుకోండి: