పుత్రున్ని కనాలని ఎందరో ఆశపడుతుంటారు. అలాంటి వారికి పొరపాటున ఆడపిల్ల పుడితే సమస్తం కోల్పోయినట్లుగా ఉంటారు. ఆడపిల్ల పుడితే ఎందుకంత బాధనో అర్ధం కాదు. ఒకవేళ కొడుకు పుట్టాడంటే వారి ఆనందానికి హద్దులే ఉండవు. ఇక ఆ పుట్టిన వాడు ఏదో ఉద్దరిస్తాడని తల్లిదండ్రులు ఆశిస్తారు. కాని సమాజంలో కన్న కొడుకులు ఎంత కౄరంగా మారుతున్నారో ఇక్కడ జరిగిన సంఘటనను గమనిస్తే ఇలాంటి కొడుకు మాకొద్దు బాబోయి అంటారు. వీన్ని కొడుకు అనడం కంటే, కొడుకు రూపంలో పుట్టిన నరరూప రాక్షాసుడు అనడం ఉత్తమం. ఇంతకు జరిగిందేమిటంటే,


నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినెపల్లి మండలం నందివద్దనం గ్రామానికి చెందిన సి కొండయ్య (80) అనే వృద్దుడు కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. వయోభారంతో తన పనులు తాను చేసుకోలేని స్దితిలో ఉన్నాడు. ఇంతలా బాధ పడుతున్న కొండయ్య పట్ల అతడి కుమారుడు దారుణంగా ప్రవర్తించాడు. స్వంత ఇంటిలో ఉండనీయకుండా ఇంటి ముందు ఓ షెడ్డు లాంటి నిర్మాణం ఏర్పాటు చేసి తండ్రిని అందులో ఉంచాడు. ఇంతే కాకుండా అనారోగ్యం చేసిన తండ్రికి సరైన వైద్యం అందించకపోగా కదలలేని స్థితిలో ఉన్న తండ్రికి ఆ కసాయి కొడుకు సరైన భోజనం కూడా పెట్టేవాడుకాదట. అంతేగాక సరైన చికిత్స అందించకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించి మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.


ఇకపోతే మరణించిన కొండయ్యను ఎవరు గమనించకపోవడంతో షెడ్డులో ఉన్న అతని శరీర భాగాలను పందులు పీక్కు తిన్నాయట. తల భాగాన్ని, ఓ చేతిని  పీక్కు తినేసి, రక్తం తాగి చప్పుడు చేయకుండా వెళ్లిపోయాయట.. ఇక ఈ ఘటన సమాజంలో మానవత విలువలు దిగజారాయనడానికి సాక్ష్యంగా నిలిచింది. ఇక ఈ దృశ్యం  స్వయంగా చూసిన స్దానికుల హృదయాలను కలచివేస్తోంది. అయితే.. అనారోగ్యంతో కొండయ్య మరణించిన తర్వాతే అతడి మృతదేహాన్ని పందులు పీక్కు తినేశాయని పోలీసులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


ఈ సంఘటన బయటకు రావడానికి కారణం  పందుల మూతికి రక్తం ఉండటాన్ని గమనించిన కొంత మందికి అనుమానం వచ్చి షెడ్డులో చూడగా దారుణం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారట. చూసారా కొడుకు పుడితే పున్నామ నరకం నుండి తప్పించుకోవచ్చనుకుంటారు. కాని ఇప్పుడు కొడుకులు పెట్టేనరకాన్ని తప్పించుకోలేకుండా ఉన్నామని గ్రహించండి అంటున్నారు ఈ విషయం తెలిసిన కొందరు. 


మరింత సమాచారం తెలుసుకోండి: