టికెట్ ధరకు ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటాం, రద్దీకి సరిపడా బస్సులు నడుపుతున్నాం ఇది తెలంగాణ ప్రభుత్వం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తరచూ సెబుతున్న విషయం. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎక్కడా కూడా బస్సులు సరిపోవటం లేదు, నడుస్తున్న బస్సుల ఆదాయానికి సంబంధించిన లెక్కా పత్రం అంటూ ఏది లేదు. అడిగేవారు లేకపోవడంతో ప్రయాణికులు దోపిడీకి బలి అవుతున్నారు. సమ్మె నేపథ్యంలో నడుపుతున్న టీస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఒక్కోక బస్సులో పరిమితికి మించి ప్రయాణాలు చేస్తున్నారు, మరోవైపు ప్రభుత్వం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. తీరా లెక్కలేసే సరికి నష్టాలు వస్తున్నాయని అంటున్నారు ఆర్టీసీ అధికారులు దింతో ప్రభుత్వం ఏమి చేయాల్నో తెలియని పరిస్థితి.


ప్రస్తుతం సమ్మె నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బస్సులు నడుపుతున్నా టిక్కెట్ ఇవ్వడం లేదు. టిక్కెట్ వ్యవస్థపై ఆర్టీసీ కసరత్తు చేయకపోవడంతో తాత్కాలిక కండెక్టర్లు నోటిమాటగా ప్రయాణికుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా గుడ్డి లెక్కన సాగిపోతావుంది. అడిగేవారు లేకపోవటంతో తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్న చాలామంది కండెక్టర్ల జేబులు నిండుతున్నాయి. అధిక చార్జీలు వసూలు చేయడం పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తునే ఉన్నారు.

ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది, దీంతో అధికారులంతా హడావుడిగా ఏర్పట్లు చేశారు. హెవీ లైసెన్స్, బ్యాడ్జి నెంబర్ ఉన్న వారిని పరీక్షించి తాత్కాలిక డ్రైవర్లుగా నియమించారు. అలాగే పదో తరగతి పాసైన వారికి కండెక్టర్లుగా అవకాశం కల్పించారు అధికారులు. సమ్మె మొదలైన నాలుగైదు గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అయింది, చేరిక సందర్భంగా ఆయా కండెక్టర్లకు వసూలు చేయాల్సిన టిక్కెట్ చార్జీల వివరాలు అధికారులు ఇచ్చారు. అయినప్పటికీ కొందరు సాధారణ టికెట్ ఛార్జీలకు మించి ఎవరికి తోచినంతగా వాళ్లు వసూలు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కండెక్టర్లు బలవంతపు వసూళ్లు చేస్తున్నారు, ప్రశ్నించే ప్రయాణికుల పట్ల దురుసుగా కూడా ప్రవర్తిస్తున్నారు.


నైపుణ్యం లేని డ్రైవర్లు ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నారు అని ప్రజలు తెలుపుతున్నారు. నిజానికి ప్రైవేటు డ్రైవర్లు, కండెక్టర్లను తీసుకున్నా ప్రయాణ చార్జీల్లో ఎలాంటి మార్పులూ ఉండవని అధికారులు ప్రకటించారు. నిర్ణీత ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని కూడా ఆదేశించారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు, బస్సుల్లో ధరల పట్టికలను కూడా ఏర్పాటు చేశారు. అయినా క్షేత్రస్థాయి పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు కదా, పర్యవేక్షణ లేకపోవటంతో అధికారుల ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు వారు. అసిఫాబాద్లో అధిక చార్జీల వసూలుపై అక్కడి ప్రయాణికులు ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన కండెక్టర్, డ్రైవర్ ను మందలించి డబ్బులను ప్రయాణికులకు తిరిగి ఇప్పించారు. అయినా కొన్ని రూట్లలో కండెక్టర్లు అధిక మొత్తంలో వసూలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు చాలా కష్టాలు పడుతున్నారు. సరిపడని అన్ని వాహనాలూ అందుబాటులో లేకపోవటంతో ఉన్న బస్సుల్లోనే ఎక్కి ప్రయాణిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: