వైసీపీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఏపీలో వలసలు టీడీపీ నుంచి బీజేపీకి ఎక్కువగా సాగాయి. బీజేపీలోకి ఇతర పార్టీల నేతలంతా క్యూ కట్టారు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీలోకి వెళ్లారు. కానీ కొంతకాలంగా ఆ పార్టీలోకి వలసలు తగ్గిపోయాయి. ఇప్పుడు వలసలు ఎక్కువగా వైసీపీలోకి వస్తున్నాయి.


వచ్చేవారంతా.. ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి తీరుకు, పాలనకు ఆకర్షితులై పలువురు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరుతున్నామని చెబుతున్నారు. తాజాగా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కృష్ణంరాజు పార్టీలో చేరారు. కృష్ణంరాజుకు సీఎం వైయస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అల్లూరితో పాటు జనసేన, టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు.


తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాజీ శాసనసభ్యుడు అల్లూరి కృష్ణంరాజు పార్టీ మారవచ్చని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఆయన ఇవాళ స్వయంగా తెరదించారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్‌లో చేరారు. వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరగా, ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.


కృష్ణం రాజు చేరిక తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా వలసలు కొనసాగుతాయని వార్తలు వస్తున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా పార్టీ మారవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక అల్లూరి కృష్ణంరాజు విషయానికి వస్తే.. ఆయన గతంలో రాజోలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాజోలును రిజర్వుడు నియోజక వర్గంగా మార్చారు. ఎస్సీలకు ఆ నియోజకవర్గం కేటాయించారు.


రాజోలు రిజర్వుడు నియోజకవర్గం కావడంతో కృష్ణంరాజు రెండువేల తొమ్మిదిలో పోటీ చేయలేకపోయారు. అల్లూరు కృష్ణంరాజు ప్రముఖ మంద్యం వ్యాపారిగా కూడా ఈయన పేరుగాంచారు. ఇక రాజోలు నియోజకవర్గం విషయానికి వస్తే.. మొన్నటి ఎన్నికల్లో జనసేన గెలిచిన ఒకే ఒక నియోజకవర్గం ఈ రాజోలు.


మరింత సమాచారం తెలుసుకోండి: