సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన ఏపి సీయం వైఎస్ జగన్, వయసుకు చిన్నవాడైనా పెద్దపెద్ద బాధ్యతలను మోస్తున్నాడు, అవినీతి రహిత పాలనకోసం శ్రమిస్తున్నాడని అందరికి తెలుస్తూనే ఉంది. ఇక ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లోకి విజయవంతంగా తీసుకువెళ్తున్నారని అన్నారు..


పథకాలు అమలవుతూ క్షేత్రస్థాయిలో అందరి మన్ననలను పొందుతూ, ప్రతి ఇంటి గడపకు చేరుతుండటంతో, మనసున్న మంచి ముఖ్యమంత్రిగా ప్రజల మనసుల్లోకి  దూసుకెళ్ళుతున్న జగన్‌ను చూస్తుంటే చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతోందని బుధవారం ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. పథకాల ఫలాలు లబ్ధిదారులకు చేరుతుండటంతో చంద్రబాబుతో పాటు ఆయన మోచేతులు నాకే బృందానికి గుండెదడ పెరిగి పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే జగన్ ప్రవేశ పెట్టిన పథకాలపై ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందనను చూస్తుంటే ప్రజల్లో జగన్ పాలనపై వున్న నమ్మకం ఏపాటిదో తెలుస్తుందని అన్నారు.


ఇక పనిపాట లేని కొందరు జగన్ మడమ తిప్పాడు, నాలుగు నెలలకే డీలా పడ్డారు అని పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ రైతు భరోసాలో లబ్ధిదారుల జాబితా వెలువడి గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటే, చంద్రబాబు మాత్రం పులివెందుల పంచాయతీ, జే ట్యాక్స్ అంటూ ఏడుపు రాగాలు తీస్తున్నారని ఆరోపించారు. ఇతని తీరు చూసిన వారే కాదు, చంద్రబాబునాయుడి మానసిక స్థితిపై ఆ పార్టీ నాయకులే తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఎప్పుడేం మాట్లాడుతున్నారో తెలియడం లేదంటూ విమర్శించారు. నిరాశా నిస్పృహలతో పాటు ఎప్పటికీ తనకు అధికారం దక్కదనే భీతి చంద్రబాబులో సృష్టంగా కనిపిస్తుందని అది ఆయనను కుంగదీస్తోందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు....


మరింత సమాచారం తెలుసుకోండి: