ముఖ్యమంత్రి జగన్ కి ఏపీ రాజకీయాల మీద పూర్తి అవగాహన  ఉంది. అంతే కాదు. రాజకీయేత వ్యవ‌స్థల మీద కూడా అవగాహన ఉంది. ఏపీలో ఎవరు ఏంటన్నది కూడా జగన్ వాసన ఇట్టే  పసి గట్టేసారు. అందుకే ఆయన ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ పాలన సాగిస్తున్నారు. ఇప్పటికివరకూ చూసుకుంటే జగన్ సర్కార్ మీద ఒక్క మచ్చ రాలేదు. విమర్శలు చేయాలని విపక్షం గాలి పోగుచేస్తోంది. అయితే ఒక కన్ను మాత్రం గట్టిగానే  గమనిస్తోంది....


అదేంటి అంటే అదే టీడీపీ అనుకూల మీడియా కన్ను. జగన్ ఆ కన్ను గురించే చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.  నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో   ఇష్టాగోష్టిగా మాట్లాడినా అన్నా మనం  ఎక్కడా తప్పులు చేయవద్దు, ఎక్కడా ఎవరికీ దొరికిపోవద్దు. ఈ మాట ఎందుచేత చెబుతున్నానంటే మనకు చంద్రబాబు బయటకు కనిపించే శత్రువు. కానీ ఆయనకు బలమైన అనుకూల మీడియా ఉంది. ఇపుడు ఆ మీడియా నిఘా నేత్రం మనమీద గట్టిగా పనిచేస్తోంది అని జగన్ చెప్పుకొచ్చారట.


అంతే కాదు. మనం ఏ చిన్న తప్పు చేసినా దాన్ని బూతద్దంలో పెట్టి చూపించి సర్కార్ మొత్తాన్ని బదనాం చేయాలనుకుంటోందని కూడా జగన్ అన్నారట. అందువల్ల మన పోరాటం పైకి కనిపించే చంద్రబాబుతో పాటు కనిపించని టీడీపీ అనుకూల  మీడియా మీద కూడా అంటూ జగన్ చెప్పేసరికి మంత్రులు కూడా అలెర్ట్ అయ్యారట. ఇప్పటికైతే మన మంత్రివర్గం సజావుగా పనిచేస్తోందని జగన్ కితాబు ఇచ్చారట. ఎవరి మీద ఏ రకమైనా ఆరోపణా లేదు. మనం అవినీతికి దూరంగా ఉన్నాం. నాకు కూడా మంత్రులు అందరితోనూ మంచి స్నేహం ఉంది. కొందరిని అన్నా అంటాను, కొందరికి ఏకంగా పేరు పెట్టి పిలిచే చనువూ ఉంది. ఇక మహిళ మంత్రులను అమ్మా అంటాను అని జగన్ తన మనసుని పూర్తిగా విప్పారట


అందువల్ల మనమంతా కష్టపడుతున్నాం, ప్రజల కోసం మంచి పాలన ఇవ్వాలనుకుంటున్నాం, ఈ దశలో ఏమైనా తప్పులు కనుక జరిగితే వాటిని దిద్దుకోలేకపోతాం, ఈ లోగా టీడీపీ అనుకూల మీడియా పొంచి ఉండి మన మీద పడిపోతుంది. అందువల్ల జాగ్రత్తగా అడుగులు వేయండని జగన్ చెప్పిన మాటలు మంత్రులకు ఎంతో బూస్టప్ ఇచ్చాయట. మొత్తానికి టీం లీడర్ గా జగన్ మంచి మార్కులే సంపాదిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: