చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంలోని కల్కి ఆశ్రమంలో రెండో రోజు ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు ఆశ్రమంలోనే ఉండి సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కల్కి ఆశ్రమానికి చెందిన నాలుగు క్యాంపస్ లలో సోదాలు జరుగుతున్నాయని సమాచారం అందుతుంది. ఆదాయపు పన్ను కట్టటం లేదని, విరాళాలు పక్కదారి పడుతున్నాయని ఫిర్యాదులు రావటంతో అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 
 
16 బృందాలుగా 400 మంది అధికారులు విడిపోయి తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో సోదాలు జరుగుతున్నాయి. వరదయ్యపాలెం కల్కి ఆశ్రమం ప్రధాన ద్వారం మూసివేసి కొన్ని ముఖ్యమైన ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న 33 కోట్ల రూపాయల నగదును అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం అందుతుంది. కల్కి భగవాన్, కృష్ణాజీ దంపతులను, సీఈవో లోకేష్ ను అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అధికారులు కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, పలు రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఒక ఆశ్రమంలో 33 కోట్ల రూపాయల నగదును అధికారులు గుర్తించారని 33 కోట్ల రూపాయల నగదులో 5 కోట్ల రూపాయల నగదు విదేశీ కరెన్సీ ఉందని తెలుస్తోంది. నగదును ఏ విధంగా ఖర్చు పెట్టారనే ఆర్థికపరమైన లావాదేవీల గురించి అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయవేత్తతో ఏర్పడిన విభేధాల వలనే ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. 
 
అధ్యాత్మిక ముసుగులో వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని మరియు ఇతర దేశాలలో కూడా ఆస్తుల కొనుగోలు జరిగిందని ట్రస్ట్ గురించి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశ్రమంలో జరిగే కార్యకలాపాల గురించి కూడా అధికారులు పూర్తి స్థాయి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తరువాత అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: