ఆర్టీసీ కార్మికులు ముందు  సమ్మె విరమిస్తేనే చర్చల ప్రక్రియ ప్రారంభించాలని యాజమాన్యం భావిస్తుండగా , తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాల జెఎసి తేల్చి చెబుతుండడంతో , సమ్మె విరమణపై సస్పెన్స్ నెలకొంది . సమ్మె ఇప్పుడప్పుడే ముగిసే అవకాశాలు లేకపోవడం , ఈ నెల 21 వ తేదీనుంచి అసలు స్కూళ్ళు , కాలేజీలు ప్రారంభమవుతాయో ?, లేదోనని   విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళనకు గురవుతున్నారు .


 ఆర్టీసీ కార్మికుల తో చర్చించి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన నేపధ్యం లో ఆర్టీసీ ఎండీ చర్చలకు కసరత్తు చేస్తూనే , మరొకవైపు భేషరతుగా సమ్మె విరమించాలని ప్రతిపాదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది . దీనితోఆర్టీసీ సమ్మె ఇప్పుడప్పుడే ముగిసే అవకాశాలేంత మాత్రం కన్పించడం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు . అదే జరిగితే విద్యాసంస్థలకు సెలవులు పొడగిస్తారా ?, లేకపోతే బస్సులు ఆశించినస్థాయి లో తిరుగుతున్నాయని చెప్పి విద్యాసంస్థలను నిర్వహిస్తారా? అన్నదిప్పుడు సస్పెన్స్ గా మారింది . ప్రజలకు ఇబ్బందులు లేకుండా బస్సులను తిప్పుతున్నామని హైకోర్టు కు నివేదించిన  రాష్ట్ర ప్రభుత్వం  , మరొక బెంచ్ లో జరిగిన విచారణలో మాత్రం ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగానే విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించినట్లు వెల్లడించింది .


 ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా  ఈ నెల 19 వ తేదీవరకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంకా సమ్మె కొనసాగుతోన్న నేపధ్యం లో ఎటువంటి నిర్ణయం తీసుకోనుందోనని విద్యార్థులతోపాటు , విద్యాసంస్థల యాజమాన్యం ఆసక్తిగా ఎదురు చూస్తోంది . ఇప్పటికే సెలవుల పొడగింపు పై విమర్శలు వెల్లువెత్తుతోన్న తరుణం లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోన్న  విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవుల పొడిగించే అవకాశాలు ఎంతమాత్రం లేవని పరిశీలకులు భావిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: