అమరావతి రాజధాని నిర్మాణం నుండి సింగపూర్ కన్సార్షియం పక్కకు తప్పుకుందా ? ఎల్లోమీడియా కథనాల ప్రకారం అలాగే వ్యవహారం.  రాజధాని నిర్మాణం ప్రాజెక్టు నుండి తాము తప్పుకుంటామని కన్సార్షియం ప్రతినిధులు స్వయంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అంగీకరించారట.  ఈ ప్రాజెక్టుపై ఇప్పటి దాకా తాము ఖర్చుపెట్టిన రూ. 12 కోట్లు ఇస్తే చాలు తాము వెళిపోతామని ప్రతినిధులు చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందట.

 

అంటే ఎల్లోమీడియా కథనం ప్రకారం స్టార్టప్ కంపెనీ పక్కకు పోయినట్లే. తాము తప్పుకుంటే ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రతినిధులు హామీ ఇచ్చారట.  కన్సార్షియం  తప్పుకుంటోంది కాబట్టి స్విప్ చాలెంజ్ పద్దతి కూడా పక్కకుపోయినట్లే భావించాలి. కాబట్టి అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీలూ ఉండవు, స్విస్ చాలెంజ్ పద్దతి ఉండదని తేలిపోయింది.

 

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబునాయుడు కలలుకన్న భ్రమరావతి లాంటి రాజధాని ఉండదని అందరికీ తెలిసిపోయింది. ఐదేళ్ళల్లో రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు చేసిన ఆర్భాటం, ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రపంచదేశాల రాజధానులన్నింటినీ మిక్సిలో వేసి కలిపి అమరావతిని నిర్మించనున్నట్లు జనాలను భ్రమల్లో ముంచేశారు.

 

ప్రపంచస్ధాయి రాజధాని నిర్మాణం అంటూ రాష్ట్ర సంపద మొత్తాన్ని సింగపూర్ కంపెనీలకు కట్టబెడదామన్న చంద్రబాబు ఆలోచనను జనాలు కూడా అంగీకరించలేదు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో గూబగుయ్యిమనిపించారు. రూ.2.6 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రపంచస్ధాయి రాజధాని అవసరమా ? అన్నదే అసలైన ప్రశ్న. జగన్ కూడా అదే విధంగా ఆలోచించినట్లున్నారు.

 

అందుకనే పరిపాలనకు సౌలభ్యంగా ఉండే అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ శాస్వత నిర్మాణాలు చేస్తే సరిపోతుందని డిసైడ్ అయినట్లు సమాచారం. హై కోర్టును కర్నూలుకు తరలించేట్లున్నారు. అలాగే వివిధ శాఖల హెడ్ ఆఫీసులను వివిధ జిల్లాలకు పంపేసి రాజధానిపై భారం తగ్గించాలన్నది ఆలోచన. కాబట్టి అమరావతి నిర్మాణం చంద్రబాబు అనుకున్నట్లు కాకుండా జగన్ అనుకున్నట్లే అయిపోతుందనటంలో సందేహం లేదు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: