మొన్న జరిగిన ఉపఎన్నికలు ఇప్పుడు కీలకం కానున్నాయి.ఈ మధ్య సమ్మె జరుగుతుండటంతో దాని ప్రభావం టీ.అర్.ఎస్ ప్రభుత్వం మీద కూడా పడుతుందేమో అని అటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇటు తెలంగాణ ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.అందులో భాగంగా ఇప్పటి వరకూ రెండు రౌండ్లు పూర్తి చేసుకోగా. రెండో రౌండ్ ఐపొయ్యేసరికి  టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 4వేల ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఫలితంపై తెలంగాణతో పాటు ఏపీ ప్రజల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ ఎన్నికల్లో మొత్తం 22 రౌండ్లు, 14 టేబుళ్ల తో చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించారు. ప్రస్తుతం ఈవీఎంలను లెక్కిస్తున్నారు. కాగా ఇరు పార్టీల అభ్యర్థులు కౌంటింగ్ మొదలవడానికి ముందే కేంద్రాలలో ఎదురుచూపులకు పరిమితం అయ్యారు. మధ్యాహ్నం 12గంటలకు దాదాపు విన్నర్ ఎవరో తెలిసిపోతుంది తెలుస్తోంది. మధ్యాహ్నం 2గంటల వరకు పూర్తి గా గెలుపెవరిది అనే అంశం ఒక క్లారిటీ రానుంది.ఇలాంటి పరిస్థితుల్లో కూడా టీ.ఆర్.ఎస్ గెలిస్తే మాత్రం ఇంక కే.సీ.ఆర్ ని ఆపే వాడు ఉండడంటూ పలువు విమర్శకులు తెలియజేస్తున్నారు.

కాంగ్రెస్ కూడా మంచి ఊపు మీద ఉండటం తో ఇరు పార్టీ నాయకులకు కాస్త టెన్షన్ కూడా మొదలైంది..

చూద్దాం విజయం ఎవరిని వరించనుందో ఏమీ చెయ్యనుందో ఫలితాల తో ఎవరి తల రాతను మార్చనుందో అంటూ సామాన్య ప్రజానీకం బెట్టింగులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు.విజయం ఎవరిని వరించినా ప్రజాలకు న్యాయం చేసే వారిలా ఉంటే చాలు అంటున్నారు రాజకీయ నిపుణులు గులాబీ దళం మళ్ళీ గెలవనుందేమో చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: