తెలుగు ప్రజల చూపు మొత్తం హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల పైన ఉంది. ఈ నెల 21న ఎన్నికల  జరగ్గా ఈరోజు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.  కాగా మొదటి రౌండ్ నుంచి టిఆర్ఎస్ పార్టీ ఆదిక్యతతో  దూసుకుపోతుంది. ప్రతి రౌండ్లోనూ మెజారిటీని పెంచుకుంటూ హై స్పీడ్  తో దూసుకుపోతున్నారు టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. అయితే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా తన భార్య పద్మావతి రెడ్డి ని రంగంలోకి దింపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టిఆర్ఎస్ సునామి  ముందు కాంగ్రెస్ చతికిల బడిపోయింది. కాంగ్రెస్ కంచుకోట లాంటి హుజూర్నగర్ లో తెరాస  సాధించడం అనేది చిన్న విషయమేమీ కాదు. 

 

 

 

 అయితే టిడిపి బిజెపి పార్టీ అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయాయి . మొదటి స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి దూసుకుపోతుండగా...  రెండవ స్థానం కాంగ్రెస్,  మూడవ స్థానంలో బీజేపీ కొనసాగుతున్నాయి. ఇంకొద్దిసేపట్లో తుది ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు విజయ సంబరాలు మొదలు పెట్టగా... కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తం పద్మావతి పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కాగా టిఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డి విజయం ఖాయం అయినట్లే. 

 

 

 

 ఇదిలా ఉండగా టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజారిటీ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుడటంపై  విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వివి ప్యాడ్ లలో ఏదో మోసం జరిగి ఉంటుందని భావిస్తున్నాయి. కాంగ్రెస్ బిజెపి టిడిపి సహా మిగిలిన పది మంది అభ్యర్థులు కూడా ఫలితాల పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  వివి ప్యాట్ స్లిప్పులు మరోసారి లెక్కించాలని అధికారులను కోరుతున్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం అందించారు. కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: