ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే అన్ని రంగాల్లో కూడా వృద్ధి చెందాలి.మోదీ.  మొదటి నుండి దీని మీద బాగా శ్రద్ధను చూపారు.అందుకే ఈ రోజున ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ చెల రేగి పోతుంది. సరళీకృత వ్యాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ 2020)లో భారత్ మరింత అభివృద్ధి చేసింది. 190 దేశాల్లో వాణిజ్యంపై ప్రపంచ బ్యాంకు సర్వే చేసి రిలీజ్ చేసిన ర్యాంకుల్లో భారత్ 63వ స్థానాన్ని పొందింది.

 

 

ఇలాంటి వ్యాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ 2020)లో భారత్ లో చెలరేగిపోతుంది. గత ఏడాది 77వ స్థానంలో నిలిచిన భారత్ ఈ సారి ఏకంగా 14 స్థానాలను మించి ఎదిగింది.

 

వాణిజ్యానికి అనుకూల పద్ధతులు నిర్మాణ పర్మిషన్స్, రుణం పొందడంలో సరళత, చిన్న సంఖ్యలోని పెట్టబడిదారులకు రక్షణ తదితర పది పాయింట్స్ ని ప్రామాణికలు గా.ఈ నివేదికను వెల్లడించారు. నిజానికి గత ఏడాది 77వ స్థానంలో ఉన్న భారత్‌ను టాప్ 50లోకి తీసుకుపోవాలని ప్రధాని మోదీ ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు కాబట్టి సాధించే పనిలో పడ్డారు.

 

ఈ నేపథ్యంలో మంచి ర్యాంకు సాధించడం భారత్‌కు ఒక మలుపు కానున్నది. ఎన్డీయే సర్కారు తీసుకున్న నిర్ణయాలు, వాణిజ్య వాతావరణం ఎదుగుదలకు  తీసుకున్న చర్యలతో భారత్ ర్యాంకులో పైకి ఎగబాక సాగుతుంది. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన 2014లో మొత్తం 190 దేశాల్లో భారత్ 142వ ర్యాంకు లో ఉంది. 2016లో 131కి ఎదిగిన భారత్ 2017లో 100కి, 2018లో 77కి, ఈ ఏడాది 63వ స్థానానికి వెళ్ళింది.గత ఏడాది దక్షిణాసియా దేశాల్లోనే సరళతర వాణిజ్యంలో భారత్ నంబర్ వన్ స్థానంకు చేరింది.ఈ సారి కూడా ఆ స్థానాన్ని మెయింటైన్ చేస్తూ ఉంది. ఇదిలా ఉండగా, మొత్తంగా నంబర్ వన్ స్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఆ తర్వాత సింగపూర్, హాంకాంగ్, డెన్మార్క్ ఉన్నాయి.అమెరికా 6వ స్థానంలో, యూకే 8వ స్థానంలో చైనా 31వ స్థానంలో, పాకిస్తాన్ 108వ స్థానంలో ఉన్నాయి.

 

చూద్దాం మొత్తంగా భారత్ ని ముందంజ లో ఉంచి దిన దిన ప్రవర్థ మానంగా మారిపోయింది అని అనడంలో ఎలాంటి ఆశ్చర్యంలోకి పోవాల్సిన పనిలేదు అని అంటున్నారు విమర్శకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: