టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా పాపులర్ అయిన బండ్ల గణేష్ గత కొంత కాలం నుండి వివాదాల ద్వారా పాపులర్ అవుతున్నాడు. నిన్న రాత్రి 
బంజారాహిల్స్ పోలీసులు బండ్ల గణేష్ ను స్టేషన్ కు పిలిపించి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కడప జిల్లాకు చెందిన మహేశ్ అనే వ్యక్తి గతంలో 20 లక్షల రూపాయలు బండ్ల గణేష్ కు అప్పుగా ఇచ్చాడు. కానీ ఆ అప్పును బండ్ల గణేష్ మహేశ్ కు చెల్లించకపోవటంతో మహేశ్ కడప న్యాయస్థానంలో బండ్ల గణేష్ పై ఫిర్యాదు చేశాడు. 
 
గతంలో కడప కోర్టు బండ్ల గణేష్ కు సమన్లు జారీ చేసినప్పటికీ బండ్ల గణేష్ ఆ సమన్లకు స్పందించలేదు. కోర్టు బండ్ల గణేష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయటంతో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం బండ్ల గణేష్ ను కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం బండ్ల గణేష్ ను నవంబర్ నెల 4వ తేదీ వరకు రిమాండ్ లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
కానీ ప్రస్తుతం బండ్ల గణేష్ కు బెయిల్ లభించిందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కీలక నేత ఒకరు బండ్ల గణేష్ బెయిల్ కొరకు సాయం చేసినట్లు తెలుస్తోంది. 2011 సంవత్సరంలో మహేశ్ బండ్ల గణేష్ కు అప్పు ఇవ్వగా 2013లో మహేశ్ చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు. బండ్ల గణేష్ పై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గతంలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. 
 
గతంలో ముంబైకి చెందిన ఫైనాన్షియర్ ఒకరు బండ్ల గణేష్ పై కేసు నమోదు చేశారు. ప్రముఖ నిర్మాత పీవీపీ కూడా కొద్ది రోజుల క్రితం బండ్ల గణేష్ పై ఫిర్యాదు చేశారు. టెంపర్ సినిమా తరువాత సినిమాలు నిర్మించని బండ్ల గణేష్ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం బండ్ల గణేష్ రోజుకు 5 లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్నాడని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: