ఊహించిన విధంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం వెల్లడైంది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన తెలంగాణలో తమ జోరు తగ్గలేదని అధికార టీఆర్ఎస్ చూపించింది. అనూహ్యంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో, హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో,ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీఆర్ఎస్ కసితో పని చేసింది. అందుకే 2018 ఎన్నికల్లో ఓడిపోయిన సైదిరెడ్డినే బరిలోకి దించారు. అటు కాంగ్రెస్ తమ కంచుకోటని కైవసం చేసుకోవడం కోసం ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డిని పోటీకి దించారు.


రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో టీఆర్ఎస్ కు కొంత ఇబ్బంది ఎదురవుతుందని అనుకున్నారు. కానీ వాటి అన్నిటిని ధీటుగా ఎదురుకుంటూ టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి 43, 284 వేల భారీ మెజారిటీతో పద్మావతిపై విజయం సాధించారు. అటు కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా, టీడీపీ, బీజేపీలు డిపాజిట్లు కోల్పోయాయి. అయితే ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఎలాగైనా గెలుస్తుందని అనుకున్నారు కానీ, ఇంత మెజారిటీతో గెలుస్తారని ఎవరు ఊహించలేదు. ఆఖరికి టీఆర్ఎస్ కూడా ఊహించి ఉండదు.


సైదిరెడ్డికి ఇంత మెజారిటీ రావడం వెనుక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మద్ధతు చాలా ఉందని తెలుస్తోంది. హుజూర్ నగర్ ఆంధ్రా బోర్డర్ లో ఉన్న నియోజకవర్గం. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం వారు ఎక్కువ. అలాగే వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిలు స్నేహంగా మెలుగుతున్నారు. ఎన్నికలు ముందు కేసీఆర్ కూడా జగన్ మద్ధతు కోరారు. దీంతో హుజూర్ నగర్ లో వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. వైసీపీ కేడర్ టీఆర్ఎస్ కు మద్ధతు తెలిపింది. దాంతోనే టీఆర్ఎస్ ఈ స్థాయిలో మెజారిటీ దక్కించుకోగలిగింది.


2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి దాదాపు 30 వేల ఓట్లు వరకు పడ్డాయి. ఇక్క‌డ వైఎస్సార్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. కృష్ణా జిల్లా వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.వైసీపీ నేత‌ల‌తో బంధుత్వం ఉన్న కాంగ్రెస్ నేత‌లంతా కారుకే ఓట్లేశారు. ఇప్పుడు అదే ఓటు బ్యాంక్ టీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ఇంత భారీ మెజారిటీ సాధించడంలో జగన్ రోల్ గట్టిగానే ఉందని అర్ధమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: