తెలంగాణలో సీఎం కేసీఆర్ కు  ఆర్టీసీ యూనియన్ల మధ్య కొన్ని రోజుల నుంచి ప్రతిష్టంభన నడుస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఇటు ప్రభుత్వం గాని అటు ఆర్టీసీ యూనియన్స్ గాని వెనక్కి తగ్గడం లేదు. దీనితో కొన్ని రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. అయితే ఇప్పటికే కేసీఆర్ ఆర్టీసీ ఖతం అయ్యిందని కార్మికులు ఉద్యోగులే కాదని ఇంకా రెచ్చగొట్టి మాట్లాడినారు. అయితే ఇప్పుడు తాజాగా హుజూర్ నగర్ ఎన్నికలో తెరాస భారీ విజయాన్ని నమోదు చేయడంతో కేసీఆర్ ప్రెస్ మీట్ లో మరీ రెచ్చిపోయి మాట్లాడినారు. నిజంగా కేసీఆర్ స్పీచ్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం రాక మానదు. ప్రజా స్వామ్యంలో ఉన్నామా .. రాచరికంలో ఉన్నామా అనే సందేహం రాక మానదు. 


ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే పిలిచి మాట్లాడాల్సింది పోయి .. ఆర్టీసీ ఖతం అయ్యిందని .. కార్మికుల ఉద్యోగాలు పోయాయని వారికి మళ్ళీ ఉద్యోగం కావాలంటే ధరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఎంతో హేళనగా మాట్లాడినారు. నిజానికి కేసీఆర్ హుజూర్ నగర్ లో ఓడిపోయి ఉంటే ఇలా మాట్లాడి ఉండేవాడు కాదేమో .. కానీ హుజూర్ నగర్ లో గెలవడంతో గెలుపు మత్తులో గులాబీ అధినేత చాలా అపహేళనగా మాట్లాడుతున్నారు. 


ఇంకా కేసీఆర్ మాట్లాడుతూ త్వరలోనే ఆరేడు వేల బస్సులకు పర్మిట్ ఇస్తామని దీనితో ఆర్టీసీ ఇక ఉండదని .. కార్మికులను బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. నిజానికి ఇటువంటి మాటలు ప్రజాస్వామ్యంలో చాలా చేటు చేస్తాయని కేసీఆర్ తొందరగా గ్రహిస్తే మంచిదే. ఎందుకంటే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. ఇప్పటికే కేసీఆర్ చర్యల పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. ఇంకొక పక్క కేసీఆర్ చర్యల పట్ల హై కోర్ట్ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: