హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఆర్టీసీ సమ్మె విషయంలో కీలకంగా మారిందన్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ ఫలితాల్లో టీఆర్‌ఎస్ తన గులాభి జండాను, కాంగ్రేస్ కంచుకోటలో ఎగిరేసి తెలంగాణాలో తమ పార్టీకీ తిరుగులేదని నిరూపించుకుందో అప్పటినుండి ఒకరకంగా చెప్పాలంటే ఆర్టీసీ కార్మికులు చిక్కుల్లో పడ్డట్లే అని అనుకుంటున్నారు కొందరు. ఇకపోతే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 24) సాయంత్రం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా బదులిచ్చారు.


ఏపిఎస్ ఆర్టీసీని జగన్‌ ప్రభుత్వంలో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం అని . ఆ పని ఈ భూగోళం ఉన్నంత కాలం జరిగేది కాదని, అది ఒక ఎక్స్‌పరిమెంట్ గా మాత్రమే చూడాలని పేర్కొన్నారు. చెప్పగానే  అవ్వడానికి అదేం బొమ్మలాట కాదని అందుకే ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఇల్లు అలుకగానే పండగ కాదు. అప్పుడే సంబర పడిపోవద్దు కమిటీ వేశారు. మూడు నెలలకో, ఆర్నెళ్లకో అసలు కథ చెబుతారట అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇకపోతే కరీంనగర్‌ సభలో కేసీఆర్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చారని, కేసీఆర్‌ మాటలతో ఎవరూ ధైర్యం కోల్పోకుండ ఉండాలని, ఓపిక పడితే అంతిమ విజయం మనదే’ అని అశ్వత్థామ రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు.


చెప్పినట్లు వినకుండా సమ్మెలకు పోయి ఆర్టీసీని నష్టం చేస్తున్నారు మీ అందరి ఉద్యోగాలు పీకేస్తా అని కేసీయార్ అన్న మాటలకు స్పందించిన ఆశ్వత్థామ తమ ఉద్యోగాలు తీసేందుకు తాము తెలంగాణ సీయం ఫాంహౌజ్‌లో పాలేర్లం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ధనిక రాష్ట్రం అని చెప్పిన తెలంగాణ మూడేళ్లలోనే నష్టాల్లోకి వచ్చిందా? అని ప్రశ్నించారు. ఆర్థిక మాంద్యం ఒక్క తెలంగాణలోనే లేదని.. ప్రపంచం అంతా ఉందని వ్యాఖ్యానించారు. ఇక అక్టోబర్ 30న సరూర్‌నగర్‌లో నిర్వహించే సకలజనుల సమరభేరిని విజయవంతం చేయాలని, పిలుపు ఇచ్చారు. ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సమరభేరికి అన్ని వర్గాలు తరలివచ్చేలా చూడాలని కార్మికులకు ఆశ్వత్థామ రెడ్డి సూచించారు..


ఇకపోతే విక్రమార్కుడి బేతాళకధను తలపించేలా సాగుతున్న ఈ పోరులో నష్టపోయేది మాత్రం కష్టపడే కార్మిక సోదరులే. నాయకులు గాని లీడర్లకు గాని పెద్దగా వచ్చిన ఇబ్బందులేవి లేవు. ఇకపోతే ఇందులో ఎవరి స్వార్దం ఎంతుందో క్షుణంగా పరిశీలించి సరైన నిర్ణయాన్ని తీసుకోలేక పోతున్నారు కాబట్టి, సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు..ఇకనైనా ఎవరో ఒకరు తమ స్వార్ధాన్ని, పట్టుని పక్కనపెట్టి తగిన రీతిలో స్పందించకుంటే సామాన్య ప్రజలకు ఎదురయ్యే గడ్డు పరిస్దితులు ఊహించడం కష్టం. సమస్య ఇలాగే కొనసాగితే ప్రజలనుండి తప్పక తిరుగుబాటును ఎదుర్కొనే రోజు వస్తుందంటున్నారు కొందరు సామాజిక విశ్లేషకులు..


మరింత సమాచారం తెలుసుకోండి: