తాజాగా జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా బీజేపీ పరిస్థితి తయారైంది. బీజేపీకి మహారాష్ట్రంలో సీట్లు బాగా తగ్గాయి. మిత్ర పక్ష శివసేన బలం ఉంటే తప్ప  సర్కార్ ఏర్పాటు సాధ్యం కాదు, అక్కడ శివసేన కొరకరాని కొయ్య అయింది. తనకు సీఎం సీటు కావాలంటోంది. ఇక హర్యానాలో బీజేపీకి మెజారిటీకి ఏడు సీట్లు తక్కువ వచ్చాయి.


ఈ నేపధ్యంలో  బీజేపీ ఇపుడు ఇండిపెండెంట్ల మీదనే ఎక్కువగా అధారపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఇండిపెండెంట్లను కమలం గూటికి చేర్చిన బీజేపె పెద్దలు మరికొందరిని బుట్టలో  వేసుకునే  ప్రయత్నాలను గట్టిగా చేస్తున్నారు. అదె కనుక జరిగితే హర్యానాలో కమల వికాసం సాధ్యమేనని చెప్పాలి.


మరో వైపు పది సీట్లు సాధించిన మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మనవడు దుష్యంత్ చౌతాలా పార్టీ జేజెపీ కీ రోల్  ప్లే చేస్తుందనుకుంటే ఇక్కడ ఇండిపెండెంట్లు ఆ ఆశలను గండికొడుతున్నారు. మరో వైపు 30 సీట్లు సాధించిన కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చెయాలన్నా కూడా జేజేపీ బలం సరిపోదు, ఇండిపెండెంట్లు ఆ పార్టీకి కూడా అవసరం.


అయితే ఇండిపెండెంట్లను తన వైపునకు తిప్పుకోవడంలో బీజేపీ ఇప్పటికే సక్సెస్ అయిన నేపధ్యంలో రేపో మాపో ఆ జాబితాతో గవర్నర్ ని కలిసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే  హర్యానాలో కిందా పడ్డా తనదే పై చేయి అని చెప్పుకోవడానికి బీజేపీ నానా తంటాలు పడుతుంటే కింగ్ మేకర్ అవుదామనుకుంటున్న దుష్యంత్ చౌతాలా ఆశలకు గండి పడుతోంది.  కాంగ్రెస్ కి కూడా చమటలు పడుతున్నాయి. మొత్తానికి అయారాం, గయారాం కి పెట్టింది పేరు అయినా హర్యానాలో మరో మారు ఆ సీన్ క్లారిటీగా కనిపిస్తోంది. అధికారం కోసం పరుగులు పెడుతున్న చోట విజేత ఎవరు అవుతారో వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: