చంద్రబాబునాయుడుకు ఈ వయసులో కూడని కష్టాలు వరసగా వచ్చేస్తున్నాయి. నలభై అయిదేళ్ళ ఏజ్ లో  ఉమ్మడి ఏపీకి సీఎం అయిన బాబుకు పాలిటిక్స్  మొదట అంతా పూల పానుపుగా గడచింది.ఇపుడు చూస్తే ఆయన రాజకీయ అద్రుష్ట రేఖ చెరిపోయినట్లుగా సూచనలు కనిపిస్తున్నాయి. బాబు ఎంత అరచి గోల పెట్టినా హడావుడి చేసినా టీడీపీది గత వైభవమేనని క్యాడర్ తో పాటు లీడర్లు అర్ధం చేసుకుంటున్నారులా ఉంది. అందుకే బిగ్ జంపింగులు షురూ అవుతున్నాయి.


విజయవాడ నడిబొడ్డున ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జగన్ని కలవడం అంటే ఏపీ రాజకీయాల్లో కీలకమైన పరిణామ‌మే. వంశీ జగన్ కి సరదాకు కలవడు. పైగా అయ్యప్ప దీక్షలో ఉన్న మనిషి. అబద్ధం చెప్పడు. ఆయన కచ్చితంగా పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. అయితే ఒక్క వంశీ మాత్రమే కాదు. చాలా పెద్ద లిస్ట్ తమ దగ్గర ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కనీసంగా పదిమంది ఎమ్మెల్యేల వరకూ టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని అంటున్నారు. ఇదంతా జరిగిన సమయం సందర్భం గొప్పది. కేంద్రంలో బీజేపీ హవా మెల్లగా తగ్గిందని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. పెట్టని కోటగా ఉన్న  ఉత్తరాదినే  బీజేపీ మసకబారితే ఇక సౌత్ లో ఆ పార్టీకి ఏముంటుంది అందువల్ల ఆ వూగిసలాటలో ఉన్న వారికి ఇపుడు జగన్ ఏకైక ఆప్షన్.


ఏపీలో టీడీపీకి వ్రుధ్ధ పార్టీ అయిపోయింది. పవన్ పార్టీ బాల్యంలోనే ఉంది. ఇక మరే పార్టీ లేదు. రాజకీయ మైదానంలో జగన్ ఒక్కడే ఆటగాడు. అందువల్ల దూకుళ్ళు మెల్లగా  మొదలై ఒక ప్రవాహంగా సాగుతాయి అంటున్నారు. ఒకరిద్దరు వస్తే ఫిరాయించినట్లుగా ఉంటుంది. అదే మూడు వంతులు ఎమ్మెల్యేలు ఒకేసారి జంప్ చేస్తే ఏపీలో వైసీపీలో టీడీపీ విలీనం అయిపోతుంది.  బహుశా ఈ మాస్టర్ ప్లాన్ జగన్ వద్ద ఉన్నట్లుంది. అదే కనుక జరిగితే కనీసం అర డజన్ ఎమ్మెల్యేలు అయినా టీడీపీలో బాబు పక్కన నిలబడతారా అన్నది పెద్ద డౌటే. ఇక బాబుకు సహజంగానే ఏపీలో విపక్ష నాయకుని హోదా పోతుంది. తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్ గల్లంతుతో జాతీయ పార్టీ హోదా కూడా పోయిందంటున్నారు. మొత్తానికి దీపావళికి అంతా బాంబులు పేల్చుకుంటారు. బాబుకు ముందే పెద్ద బాంబు వేసేశాడు వల్లభనేని వంశీ. ఆయన దీపావళి తరువాత వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
.


మరింత సమాచారం తెలుసుకోండి: