ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల ఇంటి వద్దకు చేర్చటం కొరకు గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రభుత్వం గ్రామ, వార్డ్ వాలంటీర్లకు 5 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తోంది. 
 
కానీ కొన్ని ప్రాంతాలలో పూర్తి స్థాయిలో గ్రామ, వార్డ్ వాలంటీర్ల పోస్టులు భర్తీ కాలేదు. ఈరోజు ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 9,674 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం నవంబర్ 1వ తేదీ నుండి గ్రామ వాలంటీర్ల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. నవంబర్ 10వ తేదీ వరకు ప్రభుత్వం గ్రామ, వార్డ్ వాలంటీర్ల అభ్యర్థుల నుండి ధరఖాస్తులను స్వీకరిస్తుంది. 
 
జిల్లాల వారీగా గ్రామ, వార్డ్ వాలంటీర్ల పోస్టుల ఖాళీలను బట్టి జిల్లాల వారీగా ప్రభుత్వం వేరువేరుగా నోటిఫికేషన్ లను జారీ చేస్తుందని తెలుస్తోంది. నవంబర్ 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు అభ్యర్థుల నుండి స్వీకరించిన ధరఖాస్తులను అధికారులు పరిశీలించి నవంబర్ 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు ధరఖాస్తు చేసిన అభ్యర్థులను అధికారులు ఇంటర్వ్యూలు చేస్తారు. గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు ఎంపికైన వారికి అధికారులు నవంబర్ 22వ తేదీన సమాచారం అందిస్తారు. 
 
నవంబర్ 29, నవంబర్ 30 తేదీలలో ఎంపికైన గ్రామ, వార్డ్ వాలంటీర్లకు శిక్షణ ఉంటుంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు ఎంపికైన వారు డిసెంబర్ నెల 1వ తేదీ నుండి విధులు నిర్వహిస్తారు. డిసెంబర్ నెల నుండి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: